Home /News /jobs /

ANDHRA PRADESH CM YS JAGAN MOHAN REDDY REVIEW ON STUDENTS ATTENDANCE IN GOVERNMENT SCHOOLS AK

Andhra Pradesh: విద్యార్థి స్కూల్‌కు రాకపోతే పేరెంట్స్‌కు మెసేజ్.. రెండో రోజూ రాకపోతే ఇంటికి వాలంటీర్.. సీఎం జగన్ ఆదేశం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

Andhra Pradesh Schools Reopening: గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలు చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

    ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునర్ ప్రారంభం, పిల్లల హాజరుపై సీఎం జగన్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల హాజరుపై యాప్‌ను రూపొందించారా? లేదా? అని అధికారులను సీఎం జగన్ ప్రశ్నించారు. ఫిబ్రవరి 15 నుంచి పిల్లల హాజరుపై యాప్‌ ద్వారా వివరాలు సేకరిస్తామని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలిపారు. పిల్లలు స్కూల్‌కు గైర్హాజరైన పక్షంలో వెంటనే అందుకు సంబంధించిన మెసేజ్ వారి తల్లిదండ్రులకు వెళ్లాలని అన్నారు. రెండో రోజు నేరుగా వలంటీర్‌ను పంపి వివరాలు కనుక్కోవాలని స్పష్టం చేశారు. ఈ విధానం సమర్థవంతంగా అమలు కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు – నేడు కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎం జగన్ అనేక అంశాలను చర్చించారు. రెండో విడత నాడు – నేడు పనులకు సిద్ధం కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా నాడు – నేడు కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు.

    ఈ పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. రెండో విడత నాడు – నేడు పనులను ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభిస్తామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. డిసెంబర్‌ 31లోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేసుకున్నామన్న తెలిపారు. రెండో విడత నాడు – నేడు పనులకోసం సుమారు రూ.4,446 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొదట విడత నాడు–నేడు కోసం సుమారు రూ.3,700 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని.. స్కూళ్లను బాగు చేయడానికి ఒక్క ఏడాదిలో ఇంత డబ్బు ఖర్చు చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు.

    గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలు చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడొద్దని అన్నారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. టాయిలెట్ల నిర్వహణకు సులభ్‌ ఇంటర్నేషనల్‌తో అవగాహనా ఒప్పందం చేసుకోనున్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, AP Schools, Schools reopening

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు