ANDHRA PRADESH CM YS JAGAN GREEN SIGNAL TO RELEASE GROUP 1 AND GROUP 2 JOB VACANCIES GNT NS
AP Govt Jobs: ఏపీలో కొలువుల జాతర.. గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్.. ఎన్ని ఖాళీలంటే?
వైఎస్ జగన్ (ఫైల్)
ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ (CM Jagan) శుభవార్త చెప్పారు. భారీగా గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు 110 గ్రూప్ 1 పోస్టులు, 182 గ్రూప్ 2 ఖాళీల భర్తీకి త్వరలో ఏపీపీఎస్సీ(APPSC) నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ (CM Jagan) శుభవార్త చెప్పారు. భారీగా గ్రూప్స్ (APPSC Groups Jobs) ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు 110 గ్రూప్ 1 పోస్టులు, 182 గ్రూప్ 2 ఖాళీల భర్తీకి త్వరలో ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గ్రూప్ 2 కు సంబంధించి మొత్తం 182 ఖాళీలకు గాను డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 30, సబ్ రిజిస్టార్ 16, అసిస్టెంట్ రిజిస్టార్, కోఆపరేటివ్ 15, మున్సిపల్ కమిషనర్ 5, ALO(లేబర్) 10, ASO(లా), ASO (GAD), JA (CCS), సీనియర్ అకౌంటెంట్, ట్రెజరీ డిపార్ట్ మెంట్ 10, జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీ 20, సీనియర్ ఆడిటర్, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ 5, ఆడిటర్, పే&అలవెన్స్ డిపార్ట్మెంట్ విభాగంలో 10 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. అయితే గతేడాది విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్1, గ్రూప్ 2 మొత్తం ఖాళీలు కేవలం 36 మాత్రమే ఉన్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
అయితే.. ఇంత తక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండడంపై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. పలువురు నిరుద్యోగులు ఆందోళన సైతం చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం జగన్ గ్రూప్1, గ్రూప్ 2 ఖాళీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే.. మార్చి 2022 వరకు నెలల వారీగా భర్తీ చేయనున్న ఖాళీల వివరాలతో గతేడాది ఏపీలోని జగన్ ప్రభుత్వం జ్యాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. AP Job Mela: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా.. టెన్త్ నుంచి పీజీ చేసిన వారికి 250 జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
అయితే.. ఈ జాబ్ క్యాలెండర్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలోగా మరో జాబ్ క్యాలెండర్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే. గతేడాది జాబ్ క్యాలెండర్ లో పోస్టుల సంఖ్య కేవలం 10 వేలు మాత్రమే ఉండడంతో నిరుద్యోగులు, ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై భారీగా విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సారి జాబ్ క్యాలెండర్ లో ఖాళీల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.