హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Visakhapatnam: ఎగ్జిక్యూటివ్ కేపిటల్ మాత్రమే కాదు.. ఐటీ హబ్ గా విశాఖ.. ఫోకస్ చేసిన సీఎం జగన్

Visakhapatnam: ఎగ్జిక్యూటివ్ కేపిటల్ మాత్రమే కాదు.. ఐటీ హబ్ గా విశాఖ.. ఫోకస్ చేసిన సీఎం జగన్

విశాఖ కు వైసీపీ కేంద్ర కార్యాలయం

విశాఖ కు వైసీపీ కేంద్ర కార్యాలయం

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మారేందుకు పరుగులు తీస్తున్న విశాఖపై సీఎం జగన్ మరింత ఫోకస్ చేశారు. భవిష్యత్తులో విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చి దిద్దాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

  విశాఖపట్నంపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్ చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలనుకు సిద్ధమవుతున్న ఆయన.. కాబోయే రాజధానిని భవిష్యత్తులో ఐటీ రంగానికి కేంద్రంగా మార్చాలని చూస్తున్నారు. ఐటీ రంగానికి సంబంధించిన అత్యుత్తమ విశ్వవిద్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం నగర స్థాయిని మరింతగా పెంచుతాయని భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలు అన్ని సక్రమంగా కల్పించగలిగితే.. వీటన్నింటితో కంపెనీలకు విశాఖ ఆకర్షణీయంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఐటీ హబ్ గా మారితే అదే ఉద్యోగాల కల్పనకు ప్రధాన కేంద్రం అవుతుందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలకు ఏటా ప్రోత్సాహకాలను చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. నూతన ఐటీ విధానంపై మంత్రులు, ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన పలు సూచనలు చేశారు.

  భవిష్యత్తులో మన పిల్లలకు ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన లక్ష్యం కావాలన్నారు. ఉద్యోగ శిక్షణలో భాగంగా అత్యున్నత నైపుణ్యాలను నేర్పించే కంపెనీలు, సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దీంతో పిల్లల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పనిలో అనుభవం, నైపుణ్యాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయిలో పోటీపడే అవకాశం వస్తుందని.. మొదటి ఏడాది పూర్తయిన తర్వాత నుంచి ఆ కంపెనీకి ప్రోత్సాహకాల చెల్లింపు ప్రారంభమవుతుందని. ఒక ఉద్యోగి కనీసం ఏడాది పాటు అదే కంపెనీలో పని చేయాలన్న నిబంధన ఆధారంగా ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. దీంతో మన పిల్లలకు ఏడాదిపాటు స్థిరమైన ఉపాధి లభిస్తుందని, వారిలో నైపుణ్యం మెరుగవుతుందని అధికారులతో సీఎం అన్నారు.

  ఇదీ చదవండి: ముగ్గురి పెద్దల మెడకు బిగుసుకున్న ఉచ్చు.. 9 వేల కోట్ల రికవరీ

  డిసెంబరు నాటికి 4వేల గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. దీనివల్ల గ్రామాల నుంచి వర్క్‌ ఫ్రం హోం విధానం మరింత బలోపేతం అవుతుందన్నారు. అలాగే గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడే పని చేసుకునే సదుపాయం ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రెండేళ్లలో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. విశాఖపట్నం, తిరుపతి, అనంతపురాల్లో కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుకు భూములను గుర్తించి, వాటి ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. కడపలో కొప్పర్తి ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ పనులను అక్టోబరుకల్లా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Visakha, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు