HOME »NEWS »JOBS & EDUCATION »andhra pradesh cm jagan mohan reddy gives green signal to fill empty posts in animal husbandry ministry nk

AP Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఏపీలో ఆ పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం

AP Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఏపీలో ఆ పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఏపీలో ఆ పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం (File Image)

Andhra Pradesh Jobs: ప్రభుత్వ ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలని ప్రయత్నించే వారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శుభవార్త అందించినట్లైంది ఆ వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    Andhra Pradesh Jobs: ఇన్నాళ్లూ కరోనా కారణంగా... ఖజానాలో నిధులు లేకపోవడంతో... ఖాళీ పోస్టుల భర్తీలకు ఆసక్తి చూపించని ప్రభుత్వాలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలు రికవరీ అవుతుంటే... క్రమంగా ఉద్యోగాల భర్తీవైపు అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పినట్లైంది. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు పథకాలకు సంబంధించి సీఎం జగన్... అధికారులతో సమీక్ష జరిపారు. ఈ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ పథకాల్లో లబ్దిదారులకు నిధుల మంజూరును మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు సరేనన్న అధికారులు పథకాల అమలులో ఏ సమస్యలూ లేవని చెప్పారు. ఐతే... సీఎం జగన్ మాత్రం... ఇంకా కొంతమంది తమకు లబ్ది అందట్లేదు అంటున్నారని గుర్తు చేశారు. లబ్ధిదారుల ఎంపికపై మరింత ఎక్కువ దృష్టి సారించాలని చెప్పారు. రెండో విడత వైఎస్సార్ చేయూత ఇచ్చే సమయానికి మరింత ఎక్కువ మంది సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాలోకి వచ్చేలా చూడాలని సూచించారు. మనం చేస్తున్నది మంచి పని కాబట్టి దాన్ని కొనసాగించాలనీ, ఆ విషయంలో నిబద్ధతతో ఉండాలని సీఎం జగన్ అధికారులకు తెలిపినట్లు తెలిసింది.

    ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్:


    ఏపీలో వివిధ ప్రభుత్వ శాఖల ఖాళీల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. తాజాగా సీఎం జగన్... పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులపై దృష్టి పెట్టారు. పశువులకు సంబంధించి పూర్తి హెల్త్‌ కార్డులను కొనసాగించాలన్న ముఖ్యమంత్రి.... పశువుల ఆస్పత్రులను నాడు-నేడు తరహాలో సరికొత్తగా తీర్చిదిద్దాలని చెప్పారు.

    ఇది కూడా చదవండి: NASA Asteroid: భూమివైపు గ్రహశకలం.. కొత్త వైరస్‌ని తెస్తోందా?.. నాసా ప్రకటన

    అధికారులు ఈ విషయంలో ఒకింత నిరుత్సాహంతో ఉండటాన్ని సీఎం గమనించగా... ఈ శాఖలో చాలా ఖాళీలు ఉన్నాయనీ... వాటిని భర్తీ చేస్తే తప్ప... పెండింగ్ పనులు పూర్తికావని చెప్పినట్లు తెలిసింది. వెంటనే సీఎం జగన్... ఖాళీలను పరిశీలించి భర్తీకి ఆమోదం తెలిపారు. అందువల్లో ఈ శాఖలో పోస్టుల భర్తీ త్వరలో జరగనుంది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:January 20, 2021, 09:01 IST

    टॉप स्टोरीज