హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. 5160 ఉద్యోగాల తక్షణ భర్తీకి సీఎం జగన్ ఆదేశాలు.. పూర్తి వివరాలివే

AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. 5160 ఉద్యోగాల తక్షణ భర్తీకి సీఎం జగన్ ఆదేశాలు.. పూర్తి వివరాలివే

ఏపీ సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. 5,160 ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) తాజాగా కీలక ప్రకటన చేశారు. 5,160 ఉద్యోగాలను (AP Government Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం జగన్ తాజాగా పశుసంవర్ధక శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రతీ ఆర్బీకేలో పశు సంవర్ధక శాఖ సహాయకులను నియమించాలని ఆదేశించారు. తద్వారా ఖాళీగా (Jobs) ఉన్న 5,160 ఖాళీలను భర్తీ చేయాలన్నారు. దాదాపు 1200 మంది వెటర్నరీ డాక్టర్లుగా పట్టాలు పొంది ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామంలో ఓ పశు వైద్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల, జిల్లా, డివిజన్ స్థాయిలో ఇందుకు సంబంధించిన స్టాఫింగ్ ప్యాట్రన్ ఒకే విధంగా ఉండేలా రేషనలైజేషన్ చేయాలని సీఎం ఆదేశించారు.

  ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్లు  విడుదలయ్యాయి. మొత్తం 269 ఖాళీలను భర్తీ చేయనన్నట్లు నోటిఫికేషన్లలో (APPSC Job Notifications) లో పేర్కొంది ఏపీపీఎస్సీ. ఇందులో గ్రూప్-4 కింద 6 పోస్టులు, నాన్ గెజిటెడ్ విభాగంలో 45, ఆయుర్వేద లెక్చర్ల విభాగంలో 3, హోమియో లెక్చరర్ల విభాగంలో 34, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ విభాగంలో మరో 72, హోమియో మెడికల్ ఆఫీసర్ విభాగంలో 53, యునాని మెడికల్ ఆఫీసర్ విభాగంలో 26, ఏఈఈ విభాగంలో 23 ఖాళీలు ఉన్నాయి.

  YSR Kalyanamastu: కళ్యాణమస్తు పథకం అందాలి అంటే? పది పాస్ అవ్వాల్సిందే..? సీఎం జగన్ క్లారిటీ

  ఇంకా.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో మరో 7 ఖాళీలు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు . ఆ వివరాలను నోటిఫికేషన్లలో చూడొచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా నోటిఫికేషన్లను అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్లో చూడొచ్చు. దరఖాస్తులు సైతం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Andhra Pradesh Government Jobs, Ap cm jagan, JOBS, State Government Jobs

  ఉత్తమ కథలు