ANDHRA PRADESH CM JAGAN GOVERNMENT RELEASED NOTIFICATION FOR VARIOUS JOB VACANCIES AT MODEL SCHOOLS NS
AP Govt Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి
వైఎస్ జగన్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (AP Govt Jobs Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ వరకు ఆన్లైన్లో (Job Application) చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని సీఎం జగన్ సర్కార్ (AP Government) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో (Model School) పలు ఉద్యోగాల (Jobs) భర్తీని చేపట్టనున్నట్లు తెలిపింది. మొత్తం 282 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తున్న జగన్ సర్కార్ ఆ చర్యల్లో భాగంగా మోడల్ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీని చేపట్టింది. మొత్తం 282 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (PGT) పోస్టులు 211, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGT) పోస్టులు మరో 71 ఉన్నాయి. అయితే కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
జోన్ల వారీగా ఖాళీల వివరాలు..
జోన్ల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే జోన్ 1లో పీజీటీ పోస్టులు 33, టీజీటీ పోస్టులు మరో 17 మొత్తం 50 పోస్టులు ఉన్నాయి. జోన్ 2లో మొత్తం 04 పోస్టులు ఉన్నాయి. ఇందులో పీజీటీ 04, టీజీటీ ఖాళీలు లేవు. జోన్ 3లో మొత్తం 73 పోస్టులు ఉన్నాయి. ఇందులో పీజీటీ 50, టీజీటీ 23 ఉన్నాయి. జోన్- 4లో మొత్తం 155 పోస్టులు ఉన్నాయి. ఇందులో పీజీటీ విభాగంలో 124, టీజీటీ విభాగంలో మరో 31 ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18-44 ఏళ్లు ఉండాలి. ఎస్సీ ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 49 ఏళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు. దివ్యాంగులకు 54 ఏళ్లు. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు. 10Th-Inter Jobs: టెన్త్ , ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త.. నెలకు రూ.30 వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
అభ్యర్థుల ఎంపిక:అభ్యర్థులు డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. Step 1: అభ్యర్థులు మొదటగా https://cse.ap.gov.in/ ను ఓపెన్ చేయాలి. Step 2: హోం పేజీలో PGT/ TGT ON CONTRACTUAL BASIS IN A.P. MODEL SCHOOLS లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనంతరం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.