Home /News /jobs /

ANDHRA PRADESH CM JAGAN GOVERNMENT PLANS TO RELEASE JOB NOTIFICATIONS FOR 4142 VACANCIES HERE FULL DETAILS NS

AP Govt Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఆ ప్రభుత్వ విభాగంలో 4,142 ఉద్యోగాలు.. వివరాలివే

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ లోని సీఎం జగన్ సర్కార్ (CM Jagana Government) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ (AP Government) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) లో 2,190 కొత్త ఉద్యోగాలను మంజూరు చేసింది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న 1,952 ఖాళీల భర్తీకి సైతం సర్కార్ (AP Government) ఓకే చెప్పింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2,190 కొత్త ఉద్యోగాల్లో 51 ప్రొఫెసర్ పోస్టులు, 187 అసోసియేట్ ప్రొఫెసర్లు, 130 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 1,040 స్టాఫ్ నర్సు పోస్టులు, 782 పారా మెడికల్ సిబ్బంది పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 11 మెడికల్ కాలేజీల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వం మరో 1,952 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 282 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 430 మంది స్టాఫ్ నర్సులతో పాటు టీచింగ్ హాస్పటల్స్ లో అవసరమైన ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలకు సంబంధించి త్వరలోనే ప్రకటనలు (Job Notifications) విడుదలయ్యే అవకాశం ఉంది.

    ఇదిలా ఉంటే..  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతన విద్యావిధానం, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, జగనన్న గోరుముద్ద పథకాలపై చర్చించారు. శాటిలైట్‌ఫౌండేషనల్‌ స్కూల్స్, ఫౌండేషనల్‌ స్కూల్స్, ఫౌండేషనల్‌ ప్లస్‌స్కూల్స్, ప్రీ హైస్కూల్స్, హైస్కూల్స్, హైస్కూల్‌ ప్లస్‌ స్కూల్స్‌పై అధికారులు సీఎంకు వివరాలు అందజేశారు.
    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    నూతన విద్యా విధానంలో తీసుకున్న చర్యలు వాటి అమలుపై సీఎం అధికారులను ఆరా తీశారు. 2021–22 నుంచి 2022–23, 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో మూడుదశల్లో నూతన విద్యా విధానం అమలుకానుందని.., తొలిదశలో భాగంగా ఈ విద్యా సంవత్సరం 2663 స్కూళ్లు విలీనం చేశామని.., 2,05,071 మంది విద్యార్థులు నూతన విద్యావిధానం అనుసరించి విలీనం అయ్యారని.., మొత్తంగా ఈ ప్రక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చిందన్న అధికారులు సీఎంకు వివరించారు.
    AP Postal Circle Jobs: ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్టల్ జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

    ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టిపెట్టాలని.., దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన టీచర్ల సంఖ్యను కూడా గుర్తించాలని సీఎం ఆదేశించారు. సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌మీద కూడా సమావేశంలో సీఎం సమీక్ష జరిపారు. 1092 స్కూల్స్‌ 2021–22 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ జరిగాయని అధికారులు వివరించారు. ఒక దేశంలో ఒక ఏడాది, అదికూడా ఒక రాష్ట్రంలో 1092 స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఇవ్వడం రికార్డని అధికారులు తెలిపారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Ap government, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, State Government Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు