Home /News /jobs /

ANDHRA PRADESH CM JAGAN ANNOUNCED 1 64 LAKHS JOBS TO UNEMPLOYED HERE DETAILS NS

AP Jobs - CM Jagan: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. 1.64 లక్షల ఉద్యోగాలు.. సీఎం జగన్ కీలక ప్రకటన

మాట్లాడుతున్న సీఎం జగన్

మాట్లాడుతున్న సీఎం జగన్

ఏపీలోని నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ (CM Jagan) శుభవార్త చెప్పారు. రాబోయే ఒకటి రెండేళ్లలో రాష్ట్రంలో 56 అతిభారీ, భారీ పరిశ్రమలు దాదాపు రూ.1 లక్ష 54 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    ఏపీలోని నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ (CM Jagan) శుభవార్త చెప్పారు. రాబోయే ఒకటి రెండేళ్లలో రాష్ట్రంలో 56 అతిభారీ, భారీ పరిశ్రమలు దాదాపు రూ.1 లక్ష 54 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. తద్వారా మరో 1,64,155 మందికి ఉద్యోగావకాశాలు (Jobs in AP) లభిస్తాయన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీ ఎస్‌ఈజెడ్‌లో ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫస్ట్‌ ఫేజ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఈ రోజు ప్రారంభించారు. అనంతరం మరో 8 కంపెనీలకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే రాష్ట్రంలో అతిభారీ, భారీ పరిశ్రమల విభాగంలో 98 పరిశ్రమలు రూ.39,350 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు అయ్యాయన్నారు. ఈ కంపెనీల ద్వారా 60,541 మంది పిల్లలకు మూడేళ్లలోనే ఉద్యోగాలు (Jobs) లభించాయన్నారు.

    రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక రంగంలో అడుగులు పడుతున్నాయన్నారు సీఎం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గత మూడు సంవత్సరాలుగా దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా మనమే అవార్డు తీసుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఎగుమతుల్లో చూస్తే.. ఇప్పటికే మన రాష్ట్రంలో ఆరు పోర్టులుంటే.. ఈ 3 ఏళ్లకాలంలో వేగంగా మరో 4 పోర్టులు కట్టేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒకవైపు పోర్టులు కొత్తవి నిర్మించడంతో పాటు 9 ఫిషింగ్‌ హార్బర్లు కూడా నిర్మిస్తున్నామన్నారు.
    AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో 4 రోజులే ఛాన్స్





    ప్రతీ 50 కి.మీలకు ఒక హార్బర్‌ కానీ.. ఒక పోర్టును కానీ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఆంధ్రరాష్ట్రంలో 2021–22 ఆర్ధిక సంవత్సరంలో ఎక్స్‌పోర్టెడ్‌ గూడ్స్‌ 19.3 బిలియన్‌ డాలర్లు అంటే ఇది మొత్తం దేశం ఎగుమతుల్లో 4.58 శాతమన్నారు. ఈ పోర్టులు పూర్తయిన తర్వాత ఏపీ నుంచే 10శాతం ఎగుమతులు తీసుకొచ్చే విధంగా అడుగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు సీఎం జగన్.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, JOBS, Private Jobs, State Government Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు