నేడు రాజన్న బడి బాటకు ఏపీ సీఎం జగన్..

Rajanna Badi bata: ఈ నెల 15 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక వందేమాతరం జడ్పీ హైస్కూల్‌కు సీఎం జగన్‌ వెళ్తున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 14, 2019, 6:47 AM IST
నేడు రాజన్న బడి బాటకు ఏపీ సీఎం జగన్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వేసవి సెలవులు అయిపోయాయి.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజన్న బడి బాటను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 15 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక వందేమాతరం జడ్పీ హైస్కూల్‌కు సీఎం జగన్‌ వెళ్తున్నారు. ‘రాజన్న బడిబాట’ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10.30 గంటలకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. బడిబాట కార్యక్రమం ఏర్పాట్లను విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, కలెక్టర్ ఆనంద్ శ్యామ్యూల్, విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి తదితరులు స్వయంగా పరిశీలించారు.

కాగా, 2020 ఏప్రిల్ 23వ తేదీని చివరి పనిదినంగా విద్యాశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు, ఈ ఏడాది దసరా సెలవుల్ని సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు ప్రకటించారు. అయితే రేపటి వరకు ఏపీలో ఒంటి పూట బడులు సాగనున్నాయి. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులుంటాయి. 16న ఆదివారం కావటంతో 17వ తేదీ నుండి యధావిధిగా స్కూల్స్‌ రోజు మొత్తం కొనసాగిస్తారు.

మరోవైపు ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అమ్మఒడి పథకాన్ని 2020 జనవరి 26 నుండి అమల్లోకి రానుంది. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేలను ప్రభుత్వం అందివ్వనుంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 14, 2019, 6:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading