APPSC: ఉద్యోగాల భర్తీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
APPSC | ఖాళీల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు, లోపాలకు తావులేకుండా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
news18-telugu
Updated: October 29, 2019, 4:30 PM IST

APPSC: ఉద్యోగాల భర్తీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం (file photo: ఏపీ సీఎం వైఎస్ జగన్)
- News18 Telugu
- Last Updated: October 29, 2019, 4:30 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-APPSC నిర్వహించే పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలను రద్దుచేయాలని కొద్ది రోజుల క్రితమే కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏపీపీఎస్సీ భర్తీ చేయబోయే ఉద్యోగాలకు ఇక ఇంటర్వ్యూలు ఉండవు. ఇంటర్వ్యూల రద్దు నిర్ణయం తర్వాత ఉద్యోగాల భర్తీ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్. ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు ఐఐఎం, ఐఐటీతో పాటు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థల సహకారం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీపీఎస్సీ మార్గదర్శకాల జారీకి కసరత్తు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రతీ ఏడాది జనవరిలోనే ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏపీపీఎస్సీకి వైఎస్ జగన్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు... ఆయా ఖాళీల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు, లోపాలకు తావులేకుండా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఐఎం, ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారం తీసుకోవడం ద్వారా పరీక్షల నిర్వహణలో స్థానిక అధికారుల ప్రమేయం తగ్గుతుంది. దాంతో పాటు ప్రశ్నాపత్రాల రూపకల్పన దగ్గర్నుంచి ఫలితాల విడుదల వరకు పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిRedmi K20 Pro: రెడ్మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
AP Grama Volunteer Jobs: 9,674 వాలంటీర్ ఉద్యోగాలు... ముఖ్యమైన తేదీలు ఇవే AP Ward Volunteer: ఏపీలో 19,170 వార్డు వాలంటీర్ పోస్టులు... పూర్తి వివరాలివే
Jobs: 8 నోటిఫికేషన్లు... 3,448 ఉద్యోగాలు... దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రతీ ఏడాది జనవరిలోనే ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏపీపీఎస్సీకి వైఎస్ జగన్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు... ఆయా ఖాళీల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు, లోపాలకు తావులేకుండా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఐఎం, ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారం తీసుకోవడం ద్వారా పరీక్షల నిర్వహణలో స్థానిక అధికారుల ప్రమేయం తగ్గుతుంది. దాంతో పాటు ప్రశ్నాపత్రాల రూపకల్పన దగ్గర్నుంచి ఫలితాల విడుదల వరకు పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిRedmi K20 Pro: రెడ్మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు చిక్కులు...
విజయవాడ వాసులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్...
అమ్మో అసెంబ్లీ సమావేశాలు... అమరావతిలో మహిళా ఉద్యోగుల భయం భయం...
తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం... భారీగా ఎగిసిపడిన మంటలు
తిరుపతిలో దారుణం... లిప్ట్ ఇస్తామంటూ బాలికపై ఇద్దరి అత్యాచారం
జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్..
ఇవి కూడా చదవండి:
AP Grama Volunteer Jobs: 9,674 వాలంటీర్ ఉద్యోగాలు... ముఖ్యమైన తేదీలు ఇవే
Loading...
Jobs: 8 నోటిఫికేషన్లు... 3,448 ఉద్యోగాలు... దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ
Loading...