Andhra Pradesh: ఏపీలో కొత్త తరహా స్కూళ్లు.., విద్యావిధానంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు..

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

నూతన విద్యావిధానంపై కసకత్తు పూర్తైన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.

  • Share this:
    నూతన విద్యావిధానంపై కసకత్తు పూర్తైన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. విద్యాశాఖ, అంగన్‌వాడీలలో నాడు–నేడుపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. మొదటి విడత నాడు – నేడు, నూతన విద్యావిధానం, రెండో విడత నాడు–నేడు, విద్యాకానుక సంబంధిత అంశాలపై చర్చించారు.నూతన విద్యావిధానంపై అధికారులకు కీలకమైన అదేశాలిచ్చారు. ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని.. మొదటి విడత నాడు–నేడు కింద రూపుదిద్దుకున్న స్కూళ్లను ప్రజలకు అంకితం చేయనున్న సీఎం తెలిపారు. అలాగే రెండో విడత నాడు –నేడుకు అదే రోజు శ్రీకారం చుడతామన్నారు. అలాగే ఆగస్టు 16నే విద్యాకానుక పంపిణీని కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇక నూతన విద్యా విధానం విధి, విధానాలపై ఆగష్టు 16నే ప్రకటన చేస్తామని జగన్ వెల్లడించారు. నూతన విద్యావిధానంపై గత సమావేశాల్లో ఆలోచనలు, వాటిని ఖరారు చేయడంపై చేసిన కసరత్తును అధికారులు సీఎంకు వివరించారు. నూతన విద్యావిధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ ఖరారు చేయాలని.. ఏమైనా మెరుగులు దిద్దాల్సి ఉంటే.. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఆగస్టు 16న నూతన విద్యా విధానం విధివిధానాలను వెల్లడించాలని స్పష్టం చేశారు.

    కొత్త విద్యావిధానంలో పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ ఆరు రకాల స్కూల్స్‌ ఉంటాయని జగన్ తెలిపారు. శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌ ( పీపీ–1, పీపీ–2), పౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు), పౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5 తరగతులు), ప్రీహైస్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు), హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకూ), హైస్కూల్‌ ప్లస్‌ ( 3 నుంచి 12వ తరగతి వరకూ) రానున్నాయని సీఎం తెలిపారు.

    ఇది చదవండి: ఆ జిల్లాలో పదికంటే తక్కువ కేసులు.. ఏపీలో కరోనా అప్ డేట్ ఇదే..!


    పౌండేషన్‌ స్కూళ్లలో భాగంగా అంగన్‌ వాడీల నుంచే ఇంగ్లిషు మీడియం ప్రారంభం అవుతుందని.. శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌గా అంగన్‌వాడీలు రూపాంతరం చెందుతాయన్నారు. శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌కు ఫౌండేషన్‌స్కూల్స్‌ మార్గనిర్దేశకత్వం వహిస్తాయన్న సీఎం.. ఇక్కడ కూడా ఎస్‌జీటీ టీచర్లు పర్యవేక్షణచేస్తారు, ఉత్తమ బోధన అందేలా చూస్తారని వివరించారు. శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్‌ ప్రతి ఆవాసంలో ఉంటుందని... కిలోమీటరు లోపలే పౌండేషన్‌ స్కూల్‌ ఏర్పాటవుతుందన్నారు. మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్‌ ఉంటుందని.. మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదన్నారు. వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.

    ఇది చదవండి: వైఎస్ వివేకాది సుపారీ హత్యే... వాచ్ మెన్ సంచలన స్టేట్ మెంట్



    ఉపాధ్యాయులను అత్యంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడమే నూతన విధానం ప్రధాన లక్ష్యమని సీఎం అన్నారు. పిల్లలకు ప్రతి సబ్జెక్టుపై నైపుణ్యం, ఆ సబ్జెక్టులో చక్కటి పరిజ్ఞానం ఉన్న టీచర్లతో బోధన ఉంటుందని.. ప్రస్తుతం 5 తరగతి వరకు ప్రతి టీచర్‌ 18 రకాల సబ్జెక్టులు బోధిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్‌ తర్వాత డిప్లమో ఇన్‌ ఎడ్యుకేషన్‌ చేసి సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా పనిచేస్తున్నారని.., కొన్ని చోట్ల సుమారు 200 మంది విద్యార్ధులకు ఒకే ఉపాధ్యాయుడున్నారని.. మరికొన్ని చోట్ల నలుగురికి ఒకే టీచర్‌ బోధిస్తున్న పరిస్ధితి ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. నూతన విద్యా విధానంలో ఈ రకమైన పరిస్ధితుల్లో మార్పు తెస్తున్నమని తెలిపారు. 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులును బీఈడీ, పీజీ చేసిన ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధన అందించబోతున్నామని.. తద్వారా పిల్లలకు ఫోకస్డ్‌ ట్రైనింగ్‌ వస్తుందని అభిప్రాయపడ్డారు.

    ఇది చదవండి: ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి..


    నాడు – నేడు, నూతన విద్యావిధానం కోసం ప్రభుత్వం రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తోందని సీఎం జగన్ వివరించారు. ఈ రకమైన మార్పులు తీసుకురావడం ద్వారా విద్యావ్యవస్ధ పునరుజ్జీవనానికి ఏం చేయబోతున్నామో చెప్పాలని అధికారులకు సూచించారు. మరోవైపు ఉపాధ్యాయులకు కూడా దీనిపై సమగ్ర అవగాహన కలిగించాలని.. నూతన విద్యా విధానంలో ఏరకంగా ఉద్యోగ తృప్తి ఉంటుందో వివరించాలి చెప్పారు. అంగన్‌వాడీలకు మరింత ప్రోత్సాహం కలిగించేందుకు వారికి ప్రమోషన్‌ ఛానల్‌ ఏర్పాటు చేస్తున్నామని జగన్ తెలిపారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి విద్యావ్యవస్ధలో మార్పులు తెస్తున్నామన్నారు. ఏ స్కూలునూ మూసేయం, ఎవ్వరినీ తొలగించేది లేదని జగన్ స్పష్టం చేశారు.

    ఇది చదవండి: శ్రీవారి దర్శనం టోకెన్ల పెంపుపై టీటీడీ కీలక ప్రకటన.., ఈవో ఏమన్నారంటే..


    మొదటి విడత నాడు–నేడులో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్ధవంతంగా ముందుకు సాగాలని అధికారులకు జగన్‌ స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తుకోసం, సమాజ శ్రేయస్సు కోసం ఇంత ఖర్చు పెడుతున్నామని.. ఎక్కడా అవినీతికి, వివక్షతకు తావుండరాదన్నారు. అవినీతి ఏ స్ధాయిలో ఉన్నా సహించేది లేదని స్పష్టం చేశారు. అమ్మఒడి, నాడు–నేడు, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం వంటి సంస్కరణలు విద్యా వ్యవస్ధలో మంచి ఫలితాలు అందించబోతున్నాయన్నాయని అధికారులు సీఎంతో అన్నారు. స్కూల్స్‌ ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో పాఠ్యపుస్తకాలు, డిక్షనరీ, జగనన్న విద్యా కానుక పంపిణీపై సమగ్ర వివరాలు అందించారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్ పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published: