ANDHRA PRADESH CABINET APPROVED TO FILL 4035 JOB VACANCIES IN HEALTH DEPARTMENT NS
AP Govt Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం
సీఎం జగన్ (ఫైల్ ఫొటో)
ఈ రోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం(AP Cabinet Meeting)లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 4,035 ఉద్యోగాల((Jobs)) భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ సమావేశం ఈ రోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ కేబినెట్ (AP Cabinet) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల (AP Government Jobs) భర్తీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొత్తం 4035 కొలువులను భర్తీ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ హెల్త్ క్లినిక్ లలో 560 ఫార్మసిస్టులు, మెడికల్ కాలేజీల్లో 2,190 పోస్టులును నియమంచినున్నట్లు మంత్రి పేర్ని నాని (AP Minister Perni Nani) వెల్లడించారు. వీటితో పాటు కొత్తగా 1,285 ఉద్యోగాలను భర్తీ చేయడానికి మంత్రివర్గం ఆమోదించిందన్నారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు (Job Notifications) త్వరలో విడులయ్యే అవకాశం ఉంది. కరోనా ప్రారంభమైన నాటి నుంచి జగన్ సర్కార్ (AP Government) ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 26, 917 ఖాళీలను భర్తీ చేసింది. అలాగే వచ్చేఏడాదిలో అమ్మఒడి పథకంపై (Amma Vodi Scheme) చర్చించిన మంత్రివర్గం.. ప్రతి విద్యార్థికి 75శాతం హాజరు తప్పనిసరి అనే అంశంపై ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
ఉద్యోగాల భర్తీతో పాటు ఏపీ కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు అసెంబ్లీ సమావేశాలు, సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు, సోలార్ విద్యుత్, పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు రెండు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్రవేసింది. రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనిట్ కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనను ఆమోదించింది. సినిమా టికెట్ల వివాదం ఇటీవల చర్చనీయాంశమైన నేపథ్యంలో సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Jobs In AP: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. కృష్ణా, కర్నూలు జిల్లాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
విశాఖపట్నంలోని మధురవాడలో అదానీ సంస్థకు 130 ఎకరాల కేటాయింపుకు ఆమోదం తెలిపింది. జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్టుకు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాలు, శ్రీశారదా పీఠానికి విశాఖ జిల్లా కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపుకు మంత్రివర్గం ఆమోదం తిలిపింది. ఇక నవంబర్ 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. APPSC Recruitment 2021: ఏపీలో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
అలాగే దేవాదాయ శాఖలో మార్పులపై కేబినెట్ చర్చించింది. దేవాదాయ శాఖ స్థలాలు, షాపుల లీజులు, ఇతర అంశాలపై చట్టసవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుపై చర్చ జరిగింది. ప్రకాశం జిల్లా వాడరేవుతో సహా ఐదు ఫిషింగ్ హార్బర్ల డీపీఆర్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం అమలు చేసే పథకాలకు అర్హతలుండి.. అనర్హుల జాబితాలో ఉంటే ప్రతి ఏడాది జూన్లో ఒకసారి డిసెంబర్లో ఒకసారి మరోసారి పరిశీలించి పథకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయిచింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.