Home /News /jobs /

Free Online Training: విద్యార్థులు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ కోర్సులకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Free Online Training: విద్యార్థులు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ కోర్సులకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులు, విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్లైన్లో వివిధ కోర్సులపై ఉచిత శిక్షణ అందించనున్నట్లు ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఏపీలోని నిరుద్యోగులకు వరంలా మారింది. సంస్థ నుంచి అన్ని విద్యార్హతలు కలిగిన వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల ఖాళీలను గుర్తించి వాటిని APSSDC ద్వారా భర్తీ చేస్తున్నారు. కొన్ని సార్లు నిరుద్యోగులకు కావాల్సిన ట్రైనింగ్ సైతం అందించి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, అమర రాజా, కియా మోటార్స్ లాంటి అగ్ర సంస్థల్లోనూ ఏపీఎస్ఎస్డీసీ ద్వారా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు. కనీసం వారానికి రెండు, మూడు నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా వివిధ కోర్సుల్లో నిరుద్యోగులు, విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందించేందుకు APSSDC నుంచి ప్రకటన విడుదలైంది. మూడు కోర్సులు/జాబ్ రోల్స్ పై ఆన్లైన్లో శిక్షణ అందించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
    Andhra Pradesh Jobs: ఏపీలోని ఆ జిల్లాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
    Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. Muthoot Financeలో ఉద్యోగాలు.. ఆన్లైన్ లోనే ఇంటర్వ్యూలు

    శిక్షణ వివరాలు..
    1. National Stock Exchange Financial Markets - Basic Model: ఈ కోర్సుపై 15 రోజులు, 30 గంటల పాటు ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉచిత శిక్షణ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. జూన్ 2న బ్యాచ్ ప్రారంభం కానుంది.
    2. Customer Care Executive (Call Centre) - Voice & Non Voice: ఈ కోర్సుపై 15 రోజులు 30 గంటల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ట్రైనింగ్ కు అర్హులు. జూన్ 5 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది.
    Registration - Direct Link



    3.EDP Training: ఈ కోర్సుపై 15 రోజులు 30 గంటల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. టెన్త్ పాసైన వారు ఈ కోర్సులో శిక్షణ కు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 7 నుంచి బ్యాచ్ ప్రారంభం కానుంది.
    -ఈ శిక్షణను రాష్ట్ర స్థాయిలో పేరొందిన నిపుణులు అందించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి ఆన్లైన్లో శిక్షణ అందించనున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, CAREER, JOBS, Online classes, Online Education

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు