హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh Jobs: ఏపీలో మరో జాబ్ మేళా.. డిగ్రీ, పీజీ అర్హతతో ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. వివరాలివే

Andhra Pradesh Jobs: ఏపీలో మరో జాబ్ మేళా.. డిగ్రీ, పీజీ అర్హతతో ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 10న జాబ్ మేళా(Job Mela)ను నిర్వహించినున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఇటీవల వరుసగా జాబ్ మేళా(Job Mela) లను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జాబ్ మేళాల(Job Mela) ను నిర్వహిస్తూ స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ(Jobs), ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది APSSDC. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటన(Job Notification) విడుదలైంది. ఈ నెల 10న తిరుపతిలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా Shriram Transport Finance Co Ltd, Shriram Fortune Solution సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..

Shriram Transport Finance Co Ltd: ఈ సంస్థలో మొత్తం 30 ఖాళీల భర్తీకి జాబ్ మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్ (Sales &Recovery) విభాగంలో వీటిని భర్తీ చేయనున్నారు. ఆర్ట్/సైన్స్/కామర్స్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి ఏడాదికి రూ. 2.07 లక్షల నుంచి రూ.2.32 లక్షల వరకు వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 27ఏళ్లలోపు ఉండాలని, కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పీలేరు, శ్రీకాళహస్తిలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

ఎంపిక విధానం: అభ్యర్థులకు మొదటగా ఆన్లైన్ లో ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించనున్నారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Jobs in AP: ఏపీలోని విజయనగరం జిల్లాలో ఉద్యోగాలు.. నెలకు రూ.1.10 లక్షల వేతనం.. వివరాలివే

Shriram Fortune Solution: ఈ సంస్థలో 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి ఏడాదికి రూ. 2.30 లక్షల నుంచి రూ.2.60 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. పనితీరు ఆధారంగా ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు పైగా ఉండాలని, కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసేందుకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు తిరుపతిలో పని చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఎంపిక విధానం: హెచ్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

ఇతర వివరాలు:

అభ్యర్థులు మొదటగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

-ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, డిగ్రీ సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

-ఇతర పూర్తి వివరాలకు 9493923124, 8374421195 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

AP Job Mela: ఏపీలో రేపు జాబ్ మేళా.. డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. వివరాలివే..

ఇంటర్వ్యూ నిర్వహించు చిరునామా: Shriram Transport Finance Co.Ltd, D.No: 19-3-13/K, 1st Floor, Near Hero Honda Showroom, Renigunta Road, Tirupati-Chittoor District.

First published:

Tags: Andhra Pradesh Government Jobs, Government jobs, Job Mela, Job notification, JOBS

ఉత్తమ కథలు