ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించిన ప్రకటన విడుదలైంది. Hetero Drugsలో ఖాళీలను భర్తీకి ఇంటర్వ్యూ(Interview)లను నిర్వహించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంలా మారింది. వరుసగా జాబ్ మేళా (Job Mela) లను నిర్వహిస్తూ నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలను(Jobs) కల్పిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నుంచి మరో జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ఈ నెల 6న కడప(Kadapa)లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో(Job Notification) పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో హెటిరో డ్రగ్స్(Hetero Drugs)లో 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం మూడు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు.. Jr.Chemistry /Jr.Officer: ఈ విభాగంలో 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ&ఎమ్మెస్సీ(ఆర్గానిక్ కెమిస్ట్రీ/అనలైటికల్ కెమిస్ట్రీ) విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసేందుకు అర్హులు. అభ్యర్థులు 2018-2021 మధ్య పాసై ఉండాలి. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్/విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 13 వేల నుంచి రూ. 14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఇతర అలవెన్స్ లు ఉంటాయి. Technician: ఈ విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. ITI(ఫిట్టర్)&డిప్లొమా(మెకానికల్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసేందుకు అర్హులు. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల వేతనంతో అలవెన్స్ లు చెల్లించనున్నారు. Railways Recruitment 2021: నిరుద్యోగులకు నార్త్ సెంట్రల్ రైల్వే శుభవార్త.. 1664 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే
ఇతర వివరాలు..
-అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-ఇంటర్వ్యూకు వెళ్లే సమయంలో Resume, విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ వెంట తీసుకెళ్లాలి.
-ఇతర వివరాలకు 6300125455 నంబర్ ను సంప్రదించవచ్చు. ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం:యోగి వేమన యూనివర్సిటీ క్యాంపస్, పులివెందుల రోడ్, వేమనాపురం, గంగనాపల్లే, కడప. సమయం:06-11-2021, 10:00 AM
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.