ANDHRA PRADESH APPLICATIONS INVITING FROM INTER AND DEGREE CANDIDATES FOR JOB VACANCIES AT N FIBER COMPANY NS
Andhra Pradesh Jobs: ఏపీలో ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఈ నెల 16న ఇంటర్వ్యూలు.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. N-Fiber సంస్థలో ఖాళీల భర్తీకి ఈ నెల 16న ఇంటర్వ్యూలను(Interviews) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వరుసగా జాబ్ మేళా(Job Mela)లు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలను నిర్వహిస్తున్న సంస్థ.. తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. N-Fiber సంస్థలో ఖాళీల(Jobs) భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం 30 ఖాళీలను(Jobs) ఈ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టినట్లు వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16న నెల్లూరు(Nellore)లో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు (Job Interviews) హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
విద్యార్హతల వివరాలు..
ఇంటర్ నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన వారెవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలని తెలిపారు. పురుషులు, స్త్రీలు ఎవరైనా ఇందుకు అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని ప్రకటనలో స్పష్టం చేశారు. APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్లో 38 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ఇతర వివరాలు:
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు.
-ఇతర ఏమైనా సందేహాలుంటే అభ్యర్థులు 8143227339, 6301529271 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
-ఈ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులు నెల్లూరులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ నిర్వహించే చిరునామా:Dasavi Arcade, D.No:16/3/148. 2nd floor, Opp.GPR Kalyana Mandapam, Ramalingapuram, Mini Bypass Road, Nellore.
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16న ఉదయం 10 గంటలకు పైన తెలిపిన చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో తెలిపారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.