Home /News /jobs /

ANDHRA PRADESH APPLICATIONS INVITING FROM BTECH CANDIDATES FOR JOB VACANCIES AT BHARAT FIH LTD HERE IS REGISTRATION LINK NS

BTech Jobs: బీటెక్ చేసిన వారికి జాబ్స్.. దరఖాస్తుకు రేపే లాస్ట్.. ఈ లింక్ తో అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) బీటెక్ చేసిన వారి కోసం మరో నియామక ప్రక్రియ చేపట్టింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపటి లోగా రిజిస్ట్రేషన్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) బీటెక్ చేసిన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ప్రముఖ BHARATH FIH LTD సంస్థలో ఖాళీల (Jobs) భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు హెచ్.ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలు (HR Interview) నిర్వహించి ఎంపిక చేయనున్నారు. అయితే ఎంపికైన అభ్యర్థులు శ్రీసిటీలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు: ఈ ప్రకటన ద్వారా BHARATH FIH LTD సంస్థలో మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2019, 20, 21లో పని చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు మొదటి 6 నెలల పాటు నెలకు రూ. 13 వేలు, తర్వాత 6 నెలలు రూ. 14 వేల చొప్పున వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
    కావాల్సిన ధ్రువపత్రాలు: Updated CV, టెన్త్, ఇంటర్, బీట్ మార్క్స్ షీట్, ప్రొవిజనల్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్(జిరాక్స్)
    Constable Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

    ఇతర వివరాలు:
    -హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
    -ఎంపికైన అభ్యర్థులు Tada, Sri City, ఏపీలో పని చేయాల్సి ఉంటుంది.
    -ఎంపికైన అభ్యర్థులు Rotational Shifts లో పని చేయాల్సి ఉంటుంది.
    -ఎంపికైన అభ్యర్థులకు 6 నెలలు/11 నెలల పాటు ట్రైనింగ్ పిరియడ్ ఉంటుంది.
    -పీఎఫ్, ఈఎస్ఐతో పాటు సబ్సిడీపై క్యాంటీన్, ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది.
    కావాల్సిన ధ్రువపత్రాలు: Updated CV, టెన్త్, ఇంటర్, బీట్ మార్క్స్ షీట్, ప్రొవిజనల్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్(జిరాక్స్)
    Railway Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో టెన్త్ అర్హతతో 2వేలకు పైగా జాబ్స్.. ఈ లింక్ తో అప్లై చేయండి



    -ఇంటర్వ్యూలను శ్రీసిటీ, బిజినెస్ సెంటర్, శ్రీ సిటీ, టాడా, ఏపీ చిరునామాలలో నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇంటర్వూలను నిర్వహించే తేదీ, సమయం మాత్రం వెల్లడించలేదు.
    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9494456326, 7989613024 నంబర్లను సంప్రదించవచ్చు.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Job notification, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు