ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శాఖలో ఉద్యోగాల(Jobs in Health Sector) భర్తీకి ఇటీవల వరుసగా ప్రకటనలు విడుదల అవుతున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లను అధికారులు విడుదల చేస్తున్నారు. తాజగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని గుంటూరు (Jobs in Guntur) జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి ఆ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం(DMHO) నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. పారామెడికల్ ఆప్తాలిక్ అసిస్టెంట్ (Paramedical Ophthalmic Assistant Posts) విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 21 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంకా ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎగ్జామ్ నిర్వహించడం లేదు. కేవలం ఇంటర్వ్యూ (Interview) ద్వారానే అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1న జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీన ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
విద్యార్హతల వివరాలు.. (Educational Qualifications)
AP Govt Jobs: ఏపీలోని ఆ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. భారీగా వేతనం.. ఇలా అప్లై చేసుకోండి
Salary Details: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15 వేల వేతనం చెల్లించనున్నారు.
Interview Venue: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 1న జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్, గుంటూరు చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్లో తెలిపిన పోస్టుల సంఖ్యను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పెంచడం లేదా తగ్గించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Government jobs, Health jobs, JOBS