హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రిలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

దేశ వ్యాప్తంగా ఇటీవల వైద్య విభాగంలో ఖాళీలను (Medical Jobs) ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నారు అధికారులు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల(GGH) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.500 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

ఈ ప్రకటన ద్వారా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో పర్ ఫ్యూజనిస్ట్ విభాగంలో 2, ఎంఆర్ఐ టెక్నీషిన్ విభఆగంలో 2, సిటీ టెక్నీషియన్ విభాగంలో 2, డయాలసిస్ టెక్నీషియన్ విభఆగంలో 4, కాథ్ లాబ్ టెక్నీషియన్ విభాగంలో, ఫార్మసిస్ట్ విభాగంలో మరో 2 ఖాళీలు ఉన్నాయి.

AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఎల్లుండి మరో భారీ జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు సంబంధిత కోర్సుల సర్టిఫికేట్లతో పాటు అనుభవం ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంకా ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18-42 ఏళ్లు ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.17,500-రూ.28,000 వేల వరకు చెల్లించనున్నారు.

ఇతర వివరాలు:

-అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

-అభ్యర్థులు అప్లికేషన్ ను పూర్తిగా నింపి ది సూపరింటెండెంట్, రూం నెం.124, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

-దరఖాస్తుకు ఏప్రిల్ 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తులను ఆ తేదీలోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.

First published:

Tags: Andhra Pradesh Government Jobs, Health jobs, JOBS

ఉత్తమ కథలు