Home /News /jobs /

ANDHRA PRADESH APPLICATIONS INVITING FOR JOB VACANCIES AT NSLHUB TOMORROW DEC 5 IS LAST DATE FOR REGISTRATION NS

Jobs: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ కు రేపే లాస్ట్ డేట్.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. మరో ప్రైవేటు సంస్థలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రైవేట్ ఉద్యోగాల (Private Jobs) జాతర సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలో వరుసగా జాబ్ మేళా (Job Mela) లను నిర్వహిస్తోంది. అనేక ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది APSSDC. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఐటీఐ, ఇలా అన్ని విద్యార్హతలు కలిగిన వారికి ఉద్యోగాల కల్పనకు APSSDC కృషి చేస్తోంది. తాజాగా APSSDC మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ను విడుదల చేసింది. NSLHUB(Natural Solution Language) సంస్థలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు APSSDC ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కు ఈ నెల 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    ఈ ప్రకటన ద్వారా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అసోసియేట్ ప్రాసెస్ లీడర్ ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవాలని సూచించారు. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి.
    వేతనం: ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.1.5 లక్షల వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    NPCIL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో రూ. 44,900 వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి


    రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
    కంపెనీ అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్

    ఇతర వివరాలు:
    -ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్-కొంపల్లిలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. తెలుగు భాషపై సైతం పట్టు ఉండాలని పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job notification, JOBS, Private Jobs

    తదుపరి వార్తలు