Home /News /jobs /

AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేయండి

AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ(Andhra Pradesh)లోని కర్నూల్ జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్(Job Notification) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఈ రోజు నవంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) లో వైద్య విభాగంలో పలు ఖాళీల(Jobs) భర్తీకి ఇటీవల వరుస నోటిఫికేషన్లు(Job Notifications) విడుదల చేస్తున్నారు. తాజాగా కర్నూలు(Karnool) జిల్లాలో పలు ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్(Notification) విడుదల చేశారు. స్పెషలిస్ట్ ఆఫీసర్, క్లినికల్ సైకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, మల్టీ రిహెబిలిటేషన్ వర్కర్, ఓటీ టెక్నీషియన్, అడలసెంట్ కౌన్సెలర్, స్టాఫ్ నర్స్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు(Jobs) అప్లై(Application) చేసేందుకు ఈ రోజును ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు.

    ఖాళీల వివరాలు..












































     S.No.   పోస్టు   ఖాళీలు
     1.  స్పెషలిస్ట్ ఆఫీసర్   01
     2.  క్లినికల్ సైకాలజిస్ట్   01
     3.  మెడికల్ ఆఫీసర్   01
     4.  మల్టీ రిహెబిలిటేషన్ వర్కర్   01
     5.  ఓటీ టెక్నీషియన్   01
     6.  అడలసెంట్ కౌన్సెలర్   01
     7.  స్టాఫ్ నర్స్   05

    విద్యార్హతల వివరాలు:
    స్పెషలిస్ట్ ఆఫీసర్: ఎంబీబీఎస్ తో పాటు పేడియాట్రిక్ లో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఖాళీలకు ఎంపికై నవారికి ఎంపికైన వారికి నెలకు రూ.1.10 లక్షల నుంచి రూ. 1.40 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
    CRPF Recruitment 2021: భారీ వేతనంతో సీఆర్పీఎఫ్ లో ఉద్యోగాలు.. 22వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు.. వివరాలివే

    క్లినికల్ సైకాలజిస్ట్: సంబంధిత సబ్జెక్టులో ఎంఫిల్ లేదా ఎంఏ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 33,075 వేతనం చెల్లించనున్నారు.
    మెడికల్ ఆఫీసర్: ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 53, 495 వేతనం చెల్లించనున్నారు.

    మల్టీ రిహెబిలిటేషన్ వర్కర్: అభ్యర్థులు 10+2 విద్యార్హత కలిగి ఉండాలి. ఇంకా.. మల్టీ మల్టీ రిహెబిలిటేషన్ వర్కర్ కోర్సులో ఏడాదిన్నర సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. ఏడాది పాటు హాస్పటల్ లో పని చేసిన అనుభవం ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 19, 101 వేతనం చెల్లించనున్నారు.
    ఓటీ టెక్నీషియన్: ఇంటర్ తో పాటు ఆపరేషన్ టెక్నాలజీ కోర్సులో డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల వేతనం చెల్లించనున్నారు.
    స్టాఫ్ నర్స్: బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 22,500 వరకు వేతనం చెల్లించనున్నారు.
    Cochin Shipyard Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. కొచ్చిన్ షిప్ యార్డ్ లో రూ. 50 వేల వేతనంతో ఉద్యోగాలు

    అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఎలా అప్లై చేయాలంటే..
    -అభ్యర్థులు మొదటగా ఈ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ (Application Form) ను డౌన్ లోడ్ చేయాలి.
    -అనంతరం అప్లికేషన్ ఫామ్ ను నింపి కావాల్సిన ధ్రువపత్రాలను జత చేయాలి.
    -పూర్తిగా నింపిని అప్లికేషన్ ఫామ్ ను O/o DM&HO, Kurnool చిరునామాలో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా చేరాలా అందించాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Karnool, State Government Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు