ANDHRA PRADESH APPLICATIONS INVITING FOR JOB VACANCIES AT HEALTH DEPARTMENT IN KRISHNA DISTRICT HERE DETAILS NS
AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కృష్ణా జిల్లాలో (Krishna District) పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య శాఖలో భారీగా ఉద్యోగాల (AP Government Jobs) భర్తీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొత్తం 1,317 ఖాళీలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ఇటీవల ప్రభుత్వం (AP Government) ప్రకటించింది. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఈ నియామకాలు(Recruitment) చేపడుతున్నారు. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్(Lab Technician), ఫార్మాసిస్ట్(Pharmacist) తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ (Contract) /ఔట్ సోర్సింగ్ (Out
sourcing) విధానంలో భర్తీ చేస్తున్నారు. అయితే.. ఈ ఖాళీల (Jobs) భర్తీకి అధికారులు జిల్లాల వారీగా నోటిఫికేషన్లను (Job Notifications) విడుదల చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Notification) విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
S.No
పోస్టు
ఖాళీలు
కాంట్రక్ట్/ఔట్ సోర్సింగ్
వేతనం
1.
ల్యాబ్ టెక్నీషియన్-2(Lab Technician Gr-II)
4
కాంట్రాక్ట్
రూ.28,000
2.
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (FNO)
64
ఔట్ సోర్సింగ్
రూ.12,000
3.
సానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్ (Sanitary Attender Cum Watchman)
33
ఔట్ సోర్సింగ్
రూ.12,000
విద్యార్హతల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్: ఈ ఉధ్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఇంటర్ మరియు DMLT/B.Sc MLT కోర్సును ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో చే సి ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (FNO):టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. Sanitary Attender Cum Watchman: టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయో పరిమితి: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్లో 2,213 ఉద్యోగాలు... రూ.53,500 వరకు వేతనం
అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎలా అప్లై చేయాలంటే.. Step 1:అభ్యర్థులు మొదటగా ఈ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.Jobs Step 2:అనంతరం ఆ అప్లికేషన్ ఫామ్ ను నింపాలి. Step 3:అప్లికేషన్ ఫామ్ కు టెన్త్, ఇంటర్, ఇతర విద్యార్హతల మొమోలతో పాటు నోటిఫికేషన్లో సూచించిన ఇతర ఫామ్ లను జత చేయాలి. Step 4:అప్లికేషన్ ఫామ్ ను District
Medical & Health Officer Krishna, Machilipatnam చిరునామాలో డిసెంబర్ 5 వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.