Andhra Pradesh: ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హతతో Flipkartలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

APSSDC Jobs: ఆంధ్రప్రదేశ్ లో APSSDC నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC నుంచి ఇటీవల ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. అనేక ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంస్థ ప్రకటనలు విడుదల చేస్తూ ఉంది. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కు సంబంధించిన ఈ కార్ట్ లో ఉద్యోగాల భర్తీకి APSSDC నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థఉలు ఈ నెల 31లోగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. విజయవంతంగా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 2న ఉదయం 10 గంటలకు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
    AP Govt Jobs: ఏపీలోని ఆ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
    Andhra Pradesh: నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్ లోకి మరో 1,180 పోస్టులు.. వచ్చే నెలలో నోటిఫికేషన్?

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 108 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
    EKL(Delivery Executives): ఈ విభాగంలో 42 ఖాళీలు ఉన్నాయి. టెన్త్/ఇంటర్-PASS/Fail అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ. 11 వేల నుంచి రూ.13 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    EFlex(Delivery Consultants): ఈ విభాగంలో 66 ఖాళీలు ఉన్నాయి. టెన్త్/ఇంటర్-పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి ప్రతీ డెలివరీకి రూ. 25 అందించనున్నారు.
    Registration - Direct Link



    ఇతర వివరాలు:
    హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి 15 రోజుల పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. అభ్యర్థులు సీతారాం నగర్, చిలకలూరిపేట, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, తెనాలి, రేపల్లె, మాచర్ల, వినుకొండ, భట్టిప్రోలు, నిజాంపట్నం, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. అభ్యర్థులు స్మార్ట్ ఫోన్, బైక్, డ్రైవింగ్ లైసెన్స్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇతర పూర్తి వివరాలకు 9182280707 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published: