Home /News /jobs /

AP Jobs: ఏపీలో టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ కు మరో మూడు రోజులే ఛాన్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

AP Jobs: ఏపీలో టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ కు మరో మూడు రోజులే ఛాన్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ కార్పొరేషన్ (APSSDC) మరో జాబ్ మేళా(Job Mela)ను ప్రకటించింది. ఈ జాబ్ మేళాకు హాజరుకావాలనుకుంటున్న అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్లను (Job Notifications) విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించిన ప్రకటన విడుదలైంది. Dixion Technologies India Ltdలో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం హెచ్ఆర్ రౌండ్ (HR Round) ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ (Job Registration) చేసుకోవాలని ప్రకటనలో సూచించారు. రిజిస్ట్రేషన్ కు ఈ నెల 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    ప్రొడక్షన్ అసెంబ్లింగ్ అండ్ హెల్పర్స్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ విద్యార్హత కలిగిన మహిళలు/పురుషులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. పురుషులకు 10, స్త్రీలకు 50 ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 9, 718 నుంచి రూ. 11,477 వరకు ఉపకారవేతనం చెల్లించనున్నారు.
    AP Govt Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఆ ప్రభుత్వ విభాగంలో 4,142 ఉద్యోగాలు.. వివరాలివే

    ఇతర వివరాలు: అభ్యర్థులను హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏర్పాడు మండలంలోని గోవిందాపురం గ్రామంలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. అభ్యర్థులకు వేతనంతో పాటు అటెండెన్స్ బోనస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, సబ్సిడీపై క్యాంటీన్ ఫుడ్ సదుపాయం ఉంటుంది.
    ISRO Recruitment 2021: ఇస్రోలో భారీ వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి



    ఇంటర్వ్యూ వివరాలు:
    -అభ్యర్థులు ముందుగా ఈ నెల 21 వ తేదీలోపు ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - విజయవంతంగా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 23న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
    -విజయవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

    జాబ్ మేళా నిర్వహించు చిరునామా: MPDO Office, Tirupati Rural, MR Pally, Tirupati.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job notification, Private Jobs, State Government Jobs

    తదుపరి వార్తలు