ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు (Job Notifications) విడుదలవుతున్నాయి. సంస్థ ఆధ్వర్యంలో ప్రైవేటు సంస్థల్లో ఖాళీల భర్తీని చేపడుతున్నారు. తాజాగా సంస్థ మరో ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. ప్రముఖ Axis Bank, Muthoot Finance, Laxmi Hyundai, Patra India తదితర సంస్థల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన జాబ్ మేళాను (Job Mela) ఈ నెల 28న వైజాగ్ లో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా సంస్థ అధికారిక వైబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
Muthoot Finance: ఈ సంస్థలో మొత్తం 90 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటీవ్, ప్రొబేషనరీ ఆఫీసర్, ఇంటర్న్షిప్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంబీఏ, డిగ్రీ, చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 16,100 వరకు వేతనం చెల్లించనున్నారు.
Axis Bank: ఈ సంస్థలో మొత్తం 125 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో వెల్లడించారు. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల వేతనం చెల్లించనున్నారు.
Laxmi Hyudai: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. సేల్స్ కన్సల్టెంట్స్ విభాగంలో ఈ ఖాళీలకు భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ/ఎంబీఏ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
Patra India: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.45 లక్షల వేతనం చెల్లించనున్నారు.
ఇతర వివరాలు..
అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్ ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు అభ్యర్థులు 6301046329 నంబర్ ను సంప్రదించవచ్చు.
@AP_Skill has Conducting Skill Connect Drive at St Joseph's College for women #Gynapuram @vizaggoap
Register at: https://t.co/Sflqq72a6b@AxisBank @TheMuthootGroup #Patra#LakshmiHyundai pic.twitter.com/8rFcO50AaG
— AP Skill Development (@AP_Skill) December 24, 2021
Interview Venue: St.Joseph's College For Women, Gynapuram, Covent Junction-Visakhapatnam. అభ్యర్థులు ఈ చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, Job notification, Private Jobs