Home /News /jobs /

ANDHRA PRADESH APPLICATIONS INVITING FOR JOB VACANCIES AT AXIS BANK HERE REGISTRATION LINK NS

Andhra Pradesh Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఇంటర్, డిగ్రీ అర్హతతో Axis Bankలో జాబ్స్.. రేపే ఇంటర్వ్యూలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేవ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించిన ప్రకటనను అధికారులు తాజాగా విడుదల చేశారు. ప్రముఖ Axis Bankలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.

    ఆంధ్రప్రదేవ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించిన ప్రకటనను అధికారులు తాజాగా విడుదల చేశారు. ప్రముఖ Axis Bankలో ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. మొత్తం 75 ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. రిలేషన్ షిప్ ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    ఈ ప్రకటన ద్వారా రిలేషన్ షిప్ ఆఫీసర్ విభాగంలో 75 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12,256 వేతనం ఉంటుంది. ఇంకా ఇన్సెంటీవ్స్ సైతం చెల్లించనున్నారు. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడలో పని చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థులకు టూ వీలర్ తప్పనిసరిగా ఉండాలి.
    BOB Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. ఫుల్ డీటైల్స్ ఇవిగో!



    ఇతర వివరాలు:
    - అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 20న అంటే సోమవారం ఉదయం 10 గంటలకు D.No.43-16-23, సుబ్బలక్ష్మి నగర్, బాటా షోరూం ఎదురుగా, ఇండియా బ్యాంక్ పైన, దొండపర్తి-విశాఖపట్నం జిల్లా చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    - ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు ఫార్మల్ డ్రస్ ధరించాలి.
    - Resumeతో పాటు విద్యార్హతల జిరాక్స్ కాపీని వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    - ఆధార్ తో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    - ఇతర పూర్తి వివరాలకు 9908799126 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Axis bank, Bank Jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు