AP High Court Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20న ప్రారంభమైంది. దరఖాస్తులకు ఆగస్టు 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు.
    APPSC Jobs: ఏపీపీఎస్సీ నుంచి 1200కు పైగా పోస్టులు భర్తీ.. గ్రూప్ -1, గ్రూప్ -2 తో పాటు మరికొన్ని పోస్టులు..
    AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లోని ఆ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్

    అర్హతల వివరాలు..
    బ్యాచలర్ డిగ్రీ(లా) చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ.27700 నుంచి రూ.44700 వరకు చెల్లించనున్నారు.

    పరీక్షా విధానం:
    స్క్రీనింగ్ టెస్ట్: అభ్యర్థులకు మొదటగా స్క్రీనింగ్ టెస్ట్ ను నిర్వహించనున్నారు. ఈ పరీక్షను ఆబ్జెక్టీవ్ విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సమయం 2 గంటలు. 40 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి 1:10 పద్ధతిలో షార్ట్ లిస్ట్ చేయనున్నారు.
    రాత పరీక్ష: ఇందులో 100 మార్కుల చొప్పున మొత్తం 3 పేపర్లు ఉంటాయి. సివిల్ లా, క్రిమినల్ లా, ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్ టెస్ట్, ఎస్సే టెస్ట్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారిని 50 మార్కులకు నిర్వహించే వైవా వాయిస్ కు ఎంపిక చేయనున్నారు. పరీక్షలను రాజమండ్రి, గుంటూరు, కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ ను సెప్టెంబర్ 26న నిర్వహించనున్నారు.
    అధికారిక వెబ్ సైట్: https://hc.ap.nic.in/
    Published by:Nikhil Kumar S
    First published: