Home /News /jobs /

ANDHRA PRADESH APPLICATIONS INVITING FOR JOB VACANCIES AT ANANTHAPUR DISTRICT HERE FULL DETAILS NS

AP Govt Jobs: ఏపీలో టెన్త్, డిగ్రీ, పీజీ, డిప్లొమా అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలోని అనంతపురం జిల్లాలో పలు ఉద్యోగాల(Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్(Notification) విడుదల చేశారు. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఏపీ(Andhra Pradesh)లోని నిరుద్యోగులకు శుభవార్త. అనంతపురం(Anantapuram) జిల్లాలోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పలు ఉద్యోగాల(Jobs) భర్తీకి నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. ఈ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వన్ స్టాప్ సెంటర్(Sakhi OSC) లో పలు ఖాళీలనునోటిఫికేషన్(Notification) ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు(Applications) ప్రక్రియ ఈ నెల 2న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

    ఖాళీల వివరాలు..























    పోస్టు ఖాళీలు
    పారా మెడికల్ పర్సనల్2
    కౌన్సెలర్1
    సెక్యూరిటీ గార్డ్2
    మొత్తం ఖాళీలు 5

    విద్యార్హతల వివరాలు..
    పారా మెడికల్ పర్సనల్: నర్సింగ్ కోర్సులో మూడేళ్ల డిగ్రీ/డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర హెల్త్ ప్రోగ్రామ్/ప్రాజెక్టులో మూడేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల వేతనం చెల్లించనున్నారు.
    కౌన్సెలర్: Social Work/Clinical Psychologyలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. పేరొందిన సంస్థలో మూడేళ్ల పాటు కౌన్సెలర్ గా ఫిజియోథెరపిస్ట్ గా పని చేసిన అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 13,500 వేల వేతనం చెల్లించనున్నారు.
    BEL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. BEL నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

    సెక్యూరిటీ గార్డ్: టెన్త్ విద్యార్హతతో పాటు ప్రభుత్వ లేదా పేరొందిన సంస్థలో రెండేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. విశ్రాంత మిలటరీ ఉద్యోగులకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉ:డాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 8 వేల వేతనం చెల్లించనున్నారు.
    Andhra Pradesh Jobs: ఏపీలో మరో జాబ్ మేళా.. డిగ్రీ, పీజీ అర్హతతో ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. వివరాలివే

    దరఖాస్తు విధానం..
    అభ్యర్థులు దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
    అనంతరం పూర్తి వివరాలను నింపాలి. దరఖాస్తులను జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ, అనంతపురం వారి కార్యాలయంలో ఈ నెల 15 వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh Government Jobs, Govt Jobs 2021, JOBS, State Government Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు