Home /News /jobs /

ANDHRA PRADESH APPLICATIONS INVITING FOR ANDANWADI JOBS HERE FULL DETAILS NS

AP Anganwadi Jobs: ఏపీలో టెన్త్ పాసైన మహిళలకు శుభవార్త.. ఆ జిల్లాలో అంగన్ వాడీ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ లో భారీగా అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

    ఏపీలో టెన్త్ పాసైన మహిళలకు శుభవార్త. కడప జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం జిల్లాలోని అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Digital India Jobs: డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
    BEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BELలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    మొత్తం 288 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో అంగన్ వాడీ కార్యకర్త, అంగన్ వాడీ సహాయకురాలు, మినీ అంగన్ వాడీ కార్యకర్త తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

    -అంగన్ వాడీ కార్యకర్త విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి.
    -అంగన్ వాడీ సహాయకురాలి విభాగంలో 225 ఖాళీలు ఉన్నాయి.
    -మినీ అంగన్ వాడీ కార్యకర్త విభాగంలో 13 ఖాళీలు ఉన్నాయి.

    అర్హతల వివరాలు..
    ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న మహిళలు టెన్త్ పాసై ఉండాలి. వివాహిత మహిళ అయి ఉండాలి. సదరు మహిళ స్థానికంగా నివసిస్తూ ఉండాలి. అభ్యర్థులు జులై 01 నాటికి 21 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
    Application - Direct Link
    Official Notification - Direct Link

    ఇతర వివరాలు..
    అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తులకు ఈ నెల 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ కార్యాలయం, కడప జిల్లా, ఏపీ చిరునామాలో దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది. టెన్త్ మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Anganwadi, Kadapa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు