Home /News /jobs /

ANDHRA PRADESH APPLICATIONS INVITING APPLICATIONS FOR VARIOUS JOB VACANCIES AT FLIPKART HERE REGISTRATION PROCESS NS

Flipkart Job Mela: ఏపీలో రూ.40 వేల వేతనంతో Flipkartలో జాబ్స్.. రేపే ఇంటర్వ్యూలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారికి ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ప్రముఖ ఫ్లిప్ కార్ట్ సంస్థలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ప్రముఖ ఫ్లిప్ కార్ట్ (Flipkart) సంస్థలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 29న ఈ జాబ్ మేళా (Job Mela) ను నిర్వహించనున్నారు. అమలాపురంలో ఈ జాబ్ మేళా ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు హెచ్ఆర్ మరియు ఫైనల్ రౌండ్ నిర్వహిస్తారు. తద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు సైతం అమలాపురంలోనే పని చేయాల్సి ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డెలివరీ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు 18-45 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం ఉంటుంది.
    BEL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. భారత్ ఎలక్ట్రానిక్స్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో 5 రోజులే ఛాన్స్



    ఇతర వివరాలు:
    Step 1: అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    Step 2:  రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు Instakart Services, Door No.4-5-3/1, Peramma Agrahara, Y-Junction, Amalapuram, AP-533201 చిరునామాలో ఈ నెల 29 ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
    Step 3: అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9581422339 నంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
    Step 4: అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, ఆధార్, విద్యార్హతల సర్టిఫికేట్లు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Flipkart, Job Mela, JOBS, Private Jobs

    తదుపరి వార్తలు