• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • ANDHRA PRADESH APPLICATIONS INVITED FROM INTER PASSED CANDIDATES FOR JOBS AT KAPTON FACILITES MANAGEMENT LIMITED HYDERABAD NS

Andhra Pradesh: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్, ఐటీఐ, డిప్లొమో అర్హతతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

Andhra Pradesh: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్, ఐటీఐ, డిప్లొమో అర్హతతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ - APSSDC గుడ్ న్యూస్ చెప్పింది. మరో 100 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల సంస్థ నుంచి నిత్యం వందల సంఖ్యలో ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతూనే ఉన్నాయి. తాజాగా పలు ఉద్యోగాల భర్తీకి మరో సారి సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. KAPTON FACILITES MANAGEMENT LIMITED సంస్థలో ఉద్యోగాలను భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 12లోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10 వేల వేతనంతో పాటు ఉచితంగా భోజనం, వసతి సదుపాయం అందించనున్నారు. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
    Andhra Pradesh Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో Airtelలో ఉద్యోగాలు.. అప్లికేషన్ కు ఈరోజే లాస్ట్ డేట్

    ఖాళీలు, అర్హతల వివరాలు..
    మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ట్రైనీ అండ్ మిషన్ ఆపరేటర్స్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. 2019, 20, 21 సంవత్సరాల్లో పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Registration - Direct Link



    రిజిస్ట్రేషన్..
    రిజిస్ట్రేషన్ కు ఈ నెల 12ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజస్ట్రర్ చేసుకోవాలని సూచించాను. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 6300125455, 8317545920 నంబర్లను సంప్రదించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు తెలంగాణలోని హైదరాబాద్, సంగారెడ్డి, సదాశివపేటలో పని చేయాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు