Home /News /jobs /

ANDHRA PRADESH APPLICATIONS INVITED FOR VARIOUS JOBS VACANCIES AT SRIKAKULAM DISTRICT NS

Andhra Pradesh Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ జిల్లాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని శ్రీకాకుళం జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ ఖాళీలకు అప్లై చేసుకోవడానికి ఈ నెల 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ(Aarogyasri) పథకంలో పలు ఖాళీల(Jobs) భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. టీం లీడర్, ఆరోగ్య మిత్ర, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఖాళీలను(Jobs) భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో(Notification) స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై (Job Application) చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు దరఖాస్తులను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(DMHO), శ్రీకాకుళం చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఈ నెల 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

    పోస్టులు, ఖాళీల వివరాలు..




























    S.No. పోస్టు ఖాళీలు రిజర్వేషన్
    1.టీం లీడర్1,OC(వికలాంగ-మహిళ)
    2.ఆరోగ్య మిత్ర2BC-B మహిళ ఒకటి, SC-మహిళ-ఒకటి
    3.డేటా ఎంట్రీ ఆపరేటర్3జనరల్

    విద్యార్హతల వివరాలు..
    టీం లీడర్: బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీ.ఫార్మసీ, ఫార్మసీ డీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఈ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న వారికి రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థులకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నాయకత్వ లక్షణాలు ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషలు రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    ఆరోగ్య మిత్ర: బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మసీ డీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
    డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. కంప్యూటర్ సర్టిఫికేట్ తో పాటు ఇంగ్లిష్, తెలుగులో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రభుత్వ/ప్రైవేటు ఆస్పత్రుల్లో మూడేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    Jobs in AP: ఏపీలోని ఆ ప్రభుత్వ విభాగంలో 126 ఖాళీలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక..

    ఎలా అప్లై చేయాలంటే..
    -అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ (Application Form) లను అధికారిక వెబ్ సైట్ (https://srikakulam.ap.gov.in/notice_category/recruitment/) నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -అనంతరం ఆ అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
    -నింపిన ఫామ్ లను ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంలోని డ్రాప్ బాక్స్ లో వేయాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Aarogyasri, Andhra Pradesh Government Jobs, Job notification, Srikakulam, State Government Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు