ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC నిరుద్యోగులకు చక్కని ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ప్రముఖ సంస్థలకు, నిరుద్యోగులకు వారధిగా ఉంటూ ఉద్యోగాలను కల్పిస్తోంది. రిలయన్స్, పేటీఎం, ఫ్లిప్ కార్ట్ తదితర ప్రముఖ సంస్థల్లోని ఖాళీలను సైతం స్థానిక యువతతో భర్తీ చేసేందుకు కృషి చేస్తోంది. తాజాగా ప్రముఖ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ (Reliance Smart Point) లో ఉద్యోగాల భర్తీకి APSSDC నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. APSWREIS Recruitment 2021: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
మొత్తం 75 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. పార్ట్ టైం/ఫుల్ టైం కేటగిరీల్లో ఈ నియామకాలు చేపట్టారు. పార్ట్ టైం కింద ఎంపికైన వారికి నెలకు రూ. 4,500, ఫుల్ టైం విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ. 9,500 చెల్లించనున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కూడా ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
ఇతర వివరాలు..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ ద్వారా ముందుగా ఈ నెల 24లోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 25న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు Reliance Smart Point, Captain Ramarao jn, Near to dolphin hotel main gate, vizag చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. Registration - Direct Link
హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి 15 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. అనంతరం గాజువాక, నాయిడు తోట, గోపాల పట్నం, మధురవాడ తదితర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇతర పూర్తి వివరాలకు 9010023033 నంబరును సంప్రదించాలని సూచించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.