• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • ANDHRA PRADESH APPLICATIONS INVITED FOR JOB VACANCIES AT QUESSCORP LIMITED HERE FULL DETAILS NS

AP Jobs: ఏపీలో ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ కు రేపే లాస్ట్ డేట్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివరాలు ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల సంస్థ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలవుతున్నాయి. Quesscorp limited నుంచి ఉద్యోగాల భర్తీకి APSSDC ప్రకటన విడుదల చేసింది. మొత్తం 140 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్స్(SBI Cards), జూనియర్ రిలేషన్ షిప్ ఆఫీసర్(Home and personal loans-Axis Bank) విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. విజయవంతంగా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
    Govt Jobs 2021: డిగ్రీ అర్హతతో కేంద్ర జల శక్తి శాఖలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్స్ మరియు బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్స్: ఈ విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఇతర ఇన్సెంటీవ్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

    జూనియర్ రిలేషన్ షిప్ ఆఫీసర్: ఈ విభాగంలో 40 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్ లేదా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 9500 వేతనంతో పాటు ఇన్సంటీవ్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం ఉంటుంది. అభ్యర్థులకు బైక్, లైసెన్స్, స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉండాలి. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి.
    Registration - Direct Link



    ఇతర వివరాలు..
    రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు గూగుల్ మీట్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ లింక్ మొబైల్ కు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు. రిజిస్ట్రేషన్ కు ఈ నెల 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయనగరం, అమలాపురంలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 9703460880 నంబరును సంప్రదించాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published: