కరోనా (Corona) అనంతరం దేశ వ్యాప్తంగా వైద్య విభాగంలో ఖాళీలను (Jobs) ఆయా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని వైద్య విభాగంలో ఖాళీల భర్తీకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్నాయి. తాజాగా కృష్ణా (Krishna) జిల్లా (మచిలీపట్నం) వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), కర్నూలు జిల్లా (Karnool District) లోని దిశ సఖి వన్ స్టాప్ సెంటర్ లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. కృష్ణా జిల్లాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. కర్నూలు జిల్లాలో పారామెడికల్ పర్సనల్ తో పాటు ఐటీ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
పోస్టులు ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
-కృష్ణా జిల్లాలో మొత్తం 09 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో పీడియాట్రీషియన్ విభాగంలో 1, గైనకాలజిస్ట్ విభాగంలో 6 ఖాళీలు, అనెస్తేషియా విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతల వివరాలు: ఎంబీబీఎస్ తో పాటు సంబంధిత విభాగంలో పీజీ/డిప్లొమా/DNB చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా MCI/స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
వేతనం: ఎంపికైన వారికి నెలకు రూ. 1.10 లక్షల వేతనం చెల్లించనున్నారు.
ఎలా అప్లై చేయాలంటే..
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా O/o District Medical & Health Office, Krishna, Machilipatnam చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలు ఈ నెల 25న ప్రారంభం కాగా.. 31 వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
-ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది.
-ఇతర పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ చూడండి.
APPSC Recruitment 2021: ఏపీలో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లాలో పారామెడికల్ పర్సనల్ పోస్టులు 2, ఐటీ స్టాఫ్ విభాగంలో 1 ఖాళీ ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 18 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల వేతనం ఉంటుంది.
విద్యార్హతల వివరాలు:
1. పారా మెడికల్ పర్సనల్ : పారా మెడికల్ పర్సనల్ డిగ్రీ సబ్జెక్ట్ గా /బి.యస్సీ.నర్సింగ్ /జి.యస్ .యం. విద్యార్హత కలిగి ఉండాలి.
2.IT Staff: కంప్యూటర్ డిప్లొమా/ ఐటీ విద్యార్హత కలిగి ఉండాలి. మరియు డేటా మేనేజ్మెంట్ నేపథ్యంలో లో కనీసం 3 సంవత్సరాల అనుభవంతో పనిచేసిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును.
వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల వేతనం చెల్లించనున్నారు.
ఎలా అప్లై చేయాలంటే..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను (Job Applications ) ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు అధికారిక వెబ్ సైట్ http://kurnool.ap.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులను పూర్తిగా నింపి విద్యార్హత, కులము, పుట్టిన తేదీ, నివాస ధ్రువీకరణ పత్రం జత చేసి అదనపు పథక సంచాలకులు, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, కర్నూలు చిరునామాలో నవంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Job notification, JOBS, Karnool, Krishna