హోమ్ /వార్తలు /jobs /

AP Jobs: ఏపీలో డిప్లొమో, డిగ్రీ, పీజీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

AP Jobs: ఏపీలో డిప్లొమో, డిగ్రీ, పీజీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. వివరాలు ఇలా ఉన్నాయి.

  ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. HDB Financial Services లో ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలను గూగుల్ మీట్ ద్వారా వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడ, గుంటూరు, కాకినాడ, వైజాగ్, తిరుపతి హబ్ లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో అధికారులు తెలిపారు.

  HSL Recruitment 2021: విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్‌లో పర్మనెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు

  Bank of Baroda Jobs 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  ఖాళీలు, విద్యార్హతల వివరాలు..

  మొత్తం 130 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. బిజినెస్ డవలప్మెంట్ ఎగ్జిక్యూటీవ్స్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. అభ్యర్థుల వయస్సు 22 నుంచి 32 ఏళ్లు ఉండాలి. మూడేళ్ల డిప్లొమో, డిగ్రీ, బీటెక్, పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 14 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ అందించనున్నారు.

  Registration - Direct Link

  ఇతర వివరాలు..

  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు జులై 1ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు వర్చువల్ ఇంటర్వ్యూ లింక్ పంపిస్తారు. ఆ లింక్ ద్వారా అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలు జులై 2న నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9666815987, 9030867757 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

  First published:

  ఉత్తమ కథలు