ANDHRA PRADESH APPLICATIONS INVITED FOR JOB VACANCIES AT FINCARE SMALL FINANCE BANK JULY 05 IS LAST DATE FOR APPLICATIONS NS
Bank Jobs 2021: టెన్త్ అర్హతతో ఆ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఏపీఎస్ఎస్డీసీ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపటిలోగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ - APSSDC రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంలా మారింది. వివిధ ప్రముఖ సంస్థల్లో ఖాళీల భర్తీకి సంస్థ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకనటలు విడుదల అవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. Fincare Small Finance Bank సంస్థలో ఉద్యోగాల భర్తీకి APSSDC నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు వర్చువల్ విధానంలో HR ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించబడతాయి. RINL VIZAG Steel Recruitment 2021: వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి
ఖాళీల వివరాలు..
మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. Loan disbursement collection agents విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 20, విజయనగరం జిల్లాలో 15, విశాఖపట్నం జిల్లాలో మరో 15 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు వయస్సు 18-26 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు 2019, 20, 21లో పాసై ఉండాలి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.35 లక్షల వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులకు తప్పనిసరిగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, టూ వీలర్ ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు. Registration - Direct Link
ఇతర వివరాలు..
అభ్యర్థులు ఈ నెల 5లోగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్యూలను ఈ నెల 7న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 15 రోజుల పాటు జాబ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అభ్యర్థులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర ఏమైనా సందేహాలుంటే 7609999606 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.