హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE State Ranks: జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2022 ఫలితాల్లో ఏపీకి 4, తెలంగాణకు 5వ స్థానం.. మొదటి స్థానంలో యూపీ..

JEE State Ranks: జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2022 ఫలితాల్లో ఏపీకి 4, తెలంగాణకు 5వ స్థానం.. మొదటి స్థానంలో యూపీ..

JEE Advanced Results: నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

JEE Advanced Results: నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

జేఈఈ (Joint Entrance Examination) అడ్వాన్స్‌డ్‌-2022 ఫలితాలను ఐఐటీ బాంబే నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో IIT బాంబే జోన్‌కు చెందిన RK శిశిర్ కామన్ ర్యాంక్ లిస్ట్ లో టాప్ ర్యాంకర్ గా నిలిచాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Telangana, India

  జేఈఈ (Joint Entrance Examination) అడ్వాన్స్‌డ్‌-2022 ఫలితాలను(JEE Advanced Results) ఐఐటీ బాంబే (IIT Bombay) నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. అత్యధికంగా ఉత్తీర్ణత సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నాలుగో స్థానంలో నిలవగా.. తెలంగాణ(Telangana) ఐదో స్థానానికి పరిమితం అయింది. ఈ ఫలితాల్లో అత్యధికంగా ఉత్తీర్ణత సాధించిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్(Uttara Pradesh) మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత రాజస్థాన్(Rajasthan), మూడో స్థానంలో మహారాష్ట్ర(Maharashtra) నిలిచింది.మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన ఈ రాష్ట్రాల నుంచి మొత్తం 36 శాతం మంది అర్హత సాధించారు.

  IGNOU July 2022 Admission: మరోసారి రిజిస్ట్రేషన్ గడువు పొడిగించిన ఇగ్నో.. చివరి తేదీ ఎప్పుడంటే..

  జేఈఈలకు కోచింగ్ హబ్ లుగా మారిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరుసగా  నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 3036 మంది, తెలంగాణలో 2241 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యారంగంలో చాలా పెట్టుబడులు పెట్టిందని.. పాఠశాల నుండి కళాశాల వరకు విద్యపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని.. ఐఐటీ ప్రిన్సిపాల్‌ తెలిపారు. చాలా మంది CBSE విద్యార్థులు JEEని ఛేదించగలుగుతున్నారని ఒక IIT ఫ్యాకల్టీ సభ్యుడు చెప్పారు.

  చాలా సంవత్సరాలుగా చాలా మంది విద్యార్థులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి.. అక్కడే కోచింగ్ తీసుకుంటున్నారు. దీంతో అర్హత పొందిన విద్యార్థుల జాబితాలో ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటన్నాయి. కోచింగ్ తీసుకున్న సెంటర్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఆ రాష్ట్రంలో ఉత్తీర్ణతగా పేర్కొంటూ ర్యాంకుల జాబితా వెల్లడవుతుంది. ఉదాహరణకు.. ముంబైకి చెందిన వందలాది మంది విద్యార్థులు తమ శిక్షణ పొందుతున్న రాజస్థాన్‌లో నమోదు చేసుకుని పరీక్షకు హాజరవుతారు. IIT-B నుండి సేకరించిన డేటా వివిధ రాష్ట్రాల నుండి అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను సూచిస్తుందన్నారు.

  Government Job Notifications: ఇంటర్, డిగ్రీ/బీటెక్ అర్హతతో 4 నోటిఫికేషన్లు విడుదల.. వివరాలు తెలుసుకోండి..

  ఇక ఈ ఫలితాల్లో IIT బాంబే జోన్‌కు చెందిన RK శిశిర్ కామన్ ర్యాంక్ లిస్ట్ లో టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. అతను 360 మార్కులకు 314 మార్కులు సాధించాడు. మహిళా అభ్యర్థులలో.. IIT ఢిల్లీ జోన్‌కు చెందిన తనిష్క కబ్రా CRL 16తో టాప్ ర్యాంక్ మహిళగా నిలిచింది. ఆమె 360 మార్కులకు 277 మార్కులు సాధించింది. మొత్తం 1,60,038 మంది అభ్యర్థులు నమోదు చేసుకుకోగా.. 1,55,538 మంది రెండు పేపర్‌లకు హాజరయ్యారు. వారిలో 40,712 మంది అభ్యర్థులు అర్హత సాధించారు . మొత్తం 26.17 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గింది. 2021లో ఇంజనీరింగ్ ప్రవేశంలో ఉత్తీర్ణత శాతం 30 శాతం కాగా, 2020లో 28.64 శాతంగా ఉంది.

  Qatar Airways Recruitment 2022: ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు .. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత.. 

  జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 కట్-ఆఫ్‌ను క్రాస్‌ చేసిన విద్యార్థులు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) 2022 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 11 ఉదయం 10 గంటల నుండి సెప్టెంబర్ 12 సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. AAT 2022 పరీక్ష సెప్టెంబర్ 14న జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2022లో ర్యాంకులు సాధించిన విద్యార్ధులకు నేటి నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ కౌన్సెలింగ్‌ ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్లు కల్పిస్తారు. మొత్తం దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో 16,593 సీట్లకు కౌన్సిలింగ్ జరగనుంది.

  Published by:Veera Babu
  First published:

  Tags: Career and Courses, IIT Bombay, Jee mains 2022, JOBS

  ఉత్తమ కథలు