Home /News /jobs /

ANDHRA PRADESH 10TH PUBLIC EXAMS PAPER LEAKE ISSUE TURN A POLITICAL FIGHT POLICES ARRESTED 9 PEOPLE NGS

10th Exam Papers Leak: పదో తరగతి పేపర్ల లీకులపై అనుమానాలు.. 7 గురు టీచర్లు సహా, 9 మందిపై కేసు..

ఫ్రతీకాత్మకచిత్రం

ఫ్రతీకాత్మకచిత్రం

10th Exam Papers Leak: ఓ వైపు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతుంటే.. మరోవైపు నిత్యం పేపర్ల లీక్ ఘటనలు కలకలం రేపాయి. అయితే ఈ లీకేజ్ వెనుక పెద్దల హస్తం ఉందనే అనుమానాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ మాఫియానే ఈ లీకేజ్ కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.. విపక్షాలు సైతం వీటిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  10th Exam Papers Leak: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి పరీక్షల (AP SSC Exams-2022) సందర్భంగా పేపర్ లీక్ వార్తలు కలకలం ఆగడం లేదు. ప్రతి రోజూ పేపర్ ఎక్కడో ఒక చోట పేపర్ లీక్ అవ్వడం సంచలనంగా మారుతోంది. పరీక్షల తొలిరోజు చిత్తూరు జిల్లా (Chittoor District) లో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు పేపర్ వాట్సాప్ లో ప్రత్యక్షమైనట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఐతే ఆ వార్తలు అవాస్తవమని మంత్రులు చెబుతున్నారు. ఐతే పరీక్షల రెండో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. హిందీ పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో దర్శనమి శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) సరబుజ్జిలి మండలం రొట్టవలస పరీక్షా కేంద్రంలో హిందీ పేపర్ లీక్ అయినట్లు వదంతులు వస్తున్నాయి.  మూడో రోజు సైతం అవే ఆరోపణలు వచ్చాయి.  పేపర్ ముందు లీక్ అవ్వడం కాదు.. పరీక్ష ప్రారంభమైన కాసేపటి తర్వాత ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపుల్లో కనిపిస్తున్నాయి. దీంతో ఎగ్జామ్ సెంటర్లలోనే ఈ లీకేజ్ వ్యవహారం జరుగుతోందనేది స్పష్టమవుతోంది.  కొన్ని కార్పొరేట్ స్కూళ్లు.. మార్కులు.. ర్యాంకుల గురించి వీటిని లీక్ చేస్తున్నాయి.. దీనికి తోడు మాస్ కాపియింగ్ అవకాశం కల్పిస్తున్నాయి. అందకే ఈ లీకులు రోజై వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

  అయితే ఏపీలో పదో తరగతి పరీక్ష పత్రాల లీక్ వ్యవహారం సంచలనంగా మారింది. రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. ప్రభుత్వం లీకేజ్ కాలేదని.. కేవలం మాల్ ప్రాక్టీసుగానే అధికారులు కొందరు చెబుతున్నారు. దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పరీక్షలు ప్రారంభమైన సమయం నుంచి ఇదే రకమైన ప్రచారం కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారంలో పోలసులు ఏడుగురు టీచర్లతో సహా 9 మంది పైన కేసు నమోదు చేసారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో ప్రశ్నాపత్రాల లీక్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. గణితం పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నపత్రం లీక్ అయినట్లుగా ప్రచారం జరిగింది. విచారణలో ప్రశ్నాపత్రం జవాబు పత్రాలు జిరాక్స్ తీయించినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. జవాబు పత్రాలను టీచర్ జిరాక్స్‌ సెంటర్‌లో తీయించినట్లు గుర్తించారు.

  ఇదీ చదవండి: అర్థరాత్రి తలుపుతట్టి.. ఒంటరి మహిళపై అఘాయిత్యం.. అసలు ఏం జరిగిందంటే?

  ఈ పదవ తరగతి పరీక్ష పేపర్ల లీక్ పై.. మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. పరీక్షల నిర్వహణ లో లోపాలు ఉన్నట్టు తరచూ వస్తోన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అది విద్యార్థుల మానసిక పరిస్థితి పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

  విద్యార్థులు జీవన్మరణ సమస్య గతంలో పకడ్బందీ అకడమిక్ ప్రణాళిక రూపొందించి అంతే నిబద్దతతో దాన్ని అమలు చేశామన్నారు. ఎక్కడా ఎలాంటి చిన్న అపోహకు కూడా తావివ్వలేదని గుర్తు చేశారు. అలా కాకుండా విద్యార్థుల్లో నమ్మకం కోల్పోయేలా పరిణామాలు సంభవిస్తుండడం దురదృష్టకరమంటూ ట్వీట్ చేశారు.

  ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. గత రెండేళ్లు కరోనా కారణంగా పది పరీక్షలే జరగలేదు.. రెండేళ్ల తరువాత పరీక్షలు జరుగుతుంటే.. నిత్యం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు పేపర్ లీక్ అవ్వలేదని అంటోంది.. అధికారులు కేవలం మాస్ కాపియింగ్ జరిగింది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం ఏదైనా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: 10th Class Exams, Andhra Pradesh, AP News, Ganta srinivasa rao

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు