హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో మెడికల్ జాబ్స్.. వివరాలివే..!

AP Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో మెడికల్ జాబ్స్.. వివరాలివే..!

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగాలు

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగాల (AP Government Jobs) కోసం యువత ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. కొన్నిసార్లు నేరుగా కాకపోయినా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు భర్తీ అవుతుంటాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

ప్రభుత్వ ఉద్యోగాల (AP Government Jobs) కోసం యువత ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. కొన్నిసార్లు నేరుగా కాకపోయినా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు భర్తీ అవుతుంటాయి. తాజాగా అనంతపురం జిల్లా (Anantapuram District) ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 151 స్పెషలిస్ట్ డాక్టర్ జనరల్ ఫిజీషియన్ మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచిసంబంధిత పోస్టులను బట్టి పదో తరగతి ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, ఎంబిబిఎస్, నర్సింగ్, ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అలాగే జులై 12 2022 నాటికి42 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బీసీ వారికి ఫీజులో మినహాయింపు ఉంటుంది. మరియు వికలాంగుల కూడా ఫీజు మినహాయింపు ఉంటుంది. విద్యా అర్హతలు రిజర్వేషన్స్ అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి 12 వేల నుంచి లక్ష రూపాయల 10 వేల వరకూజీతం చెల్లిస్తారు.

ఇది చదవండి: కిక్కు కావాలి అనుకునే వారు తప్పక చూడాల్సిన ప్లేస్.. థ్రిల్ మామూలుగా ఉండదు..

ఖాళీల వివరాలు

స్పెషలిస్ట్ ఓబీజీ పోస్టులు 10, జనరల్ ఫిజీషియన్ పోస్ట్ 4, స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్ పోస్ట్ 1, కన్సల్టెంట్ మెడిసన్ పోస్ట్ 1, స్పెషలిస్ట్ pediatrician పోస్ట్ 1, మెడికల్ ఆఫీసర్ పోస్ట్ 50 ,స్టాఫ్ నర్స్ పోస్ట్ 29, ఓట్ టెక్నీషియన్ పోస్ట్ 8, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు 7, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 8, హాస్పిటల్ అటెండెంట్ పోస్టులు 2, ఫార్మసిస్ట్, గ్రేడ్-2 పోస్టులు 4, జూనియర్ అసిస్టెంట్ కం అకౌంటెంట్ పోస్టులు 1, బ్లడ్ బ్యాంక్ బ్లడ్ స్టోరేజ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేటు పోస్టులు 5, dental hygienist పోస్టులు 1, cooking కేర్ టేకర్ పోస్టులు 1, న్యూట్రీషియన్ కౌన్సిలర్ పోస్ట్ ఒకటి, క్లినికల్ సైకాలజీ పోస్టు 2, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టుల ఒకటి, అటెండర్ కం వార్డు క్లీనర్ పోస్టులు 1, ఇతర సమాచారం కోసం అధికార వెబ్ సైట్ ని సంప్రదించాలని తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Ap jobs, Local News

ఉత్తమ కథలు