Home /News /jobs /

AN IT COMPANY RECRUITS THAT EMPLOYS 5000 FRESHERS IF THESE QUALITIES ARE PRESENT THE JOB IS PERFECT GH VB

Fresher Jobs: ఫ్రెషర్స్ కు గుడ్ న్యూస్.. ఈ క్వాలిటీ మీలో ఉందా.. అయితే జాబ్ పక్కా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్, ఐటీ సేవల సంస్థ మైండ్‌ట్రీ (Mindtree) ఫ్రెషర్లను నియమించుకునేందుకు రెడీ అయ్యింది. అయితే తాము ఉద్యోగం ఇవ్వాలంటే ఫ్రెషర్స్‌ (Freshers)కు మూడు క్వాలిటీలు ఉండాలని ఈ సంస్థ స్పష్టం చేస్తోంది.

ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్, ఐటీ సేవల సంస్థ మైండ్‌ట్రీ (Mindtree) ఫ్రెషర్లను నియమించుకునేందుకు రెడీ అయ్యింది. అయితే తాము ఉద్యోగం ఇవ్వాలంటే ఫ్రెషర్స్‌ (Freshers)కు మూడు క్వాలిటీలు ఉండాలని ఈ సంస్థ స్పష్టం చేస్తోంది. ఒక ఫ్రెషర్‌లో లెర్న్ (Learn), అడాప్ట్ (Adapt) అయ్యే సామర్థ్యంతో పాటు A అనే ఒక స్కిల్ నుంచి మరొక స్కిల్ అలవర్చుకోగల శక్తి ఉంటే వారిని హైర్ చేసుకుంటామని మైండ్‌ట్రీ సీఈఓ దేభాషిస్ ఛటర్జీ (Debashis Chatterjee) చెప్పారు. జాబ్ కావాలంటే లెర్న్, అడాప్ట్, స్కిల్ చేంజింగ్ ఎబిలిటీ అనే మూడు క్వాలిటీలు ఫ్రెషర్స్‌కు తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. 2022లో దాదాపు 5,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఈ కంపెనీ సీఈఓ వెల్లడించారు.

TSPSC Group 1: గ్రూప్స్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. పేప‌ర్ క‌రెక్ష‌న్‌లో మార్పులు తీసుకొస్తున్న టీఎస్‌పీఎస్‌సీ

ఛటర్జీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ, ఫ్రెషర్లు ఎక్కడి నుంచి వచ్చినా వారు ఇండక్షన్ ప్రోగ్రామ్ (Induction Programme) ద్వారా వెళ్లవలసి ఉంటుందని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ని కంపెనీ ఇటీవలే కొత్తగా ఇంప్రూవ్ చేసింది. “నేర్చుకునే సామర్థ్యం (Learnability) చాలా ముఖ్యమైన అంశం అని నేను భావిస్తున్నాను. నేర్చుకోవడానికి ఇష్టపడేవారు, కొత్త కండిషన్లకు లేదా పరిస్థితులకు అనుకూలంగా మారేవారు.. టెక్నాలజీ మారుతున్న విధానాన్ని బట్టి ఒక నైపుణ్యం నుంచి ఇంకో నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారిని మాత్రమే మేం వెతుకుతున్నాం,” అని ఛటర్జీ పేర్కొన్నారు.

గత సంవత్సరంలో డిమాండ్ ఊపందుకోవడంతో కంపెనీ తాజాగా నియామకాలను వేగవంతం చేసింది. ఇది జనవరి నుంచి మార్చి 2022 త్రైమాసికంలో 1,500 మంది ఫ్రెషర్‌లను నియమించుకుంది. 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ చేసే నియామకాల సంఖ్యను ఛటర్జీ చెప్పలేదు కానీ ఈ ఆర్థిక సంవత్సరం గడుస్తున్నా కొద్దీ ఈ సంఖ్య పెరుగుతుందని ఛటర్జీ తెలిపారు. అయితే అంతకుముందు జరిగిన ఇంటరాక్షన్‌లో, ఫైనాన్షియల్ ఇయర్ 2022లో దాదాపు 5,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని... వచ్చే ఆర్థిక సంవత్సరంలో దానిని 40-50 శాతం పెంచాలని తాను ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఛటర్జీ చెప్పారు.

Infosys: ఇన్ఫోసిస్ కొత్త రూల్‌.. రిజైన్ చేస్తే.. ఆరు నెల‌ల‌పాటు ఆ కంపెనీల్లో చేరొద్దని రూల్‌!

"ముందటి సంవత్సరాలతో పోల్చితే, ఫైనాన్షియల్ ఇయర్ 2022లో మేం ఎక్కువ మంది ఫ్రెషర్లను నియమించుకుంటున్నాం. ఈ సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత పెరుగుతుంది. అయితే ప్రజలను ఎలా నియమించుకోవాలి.. మాకు అవసరమైన డిజిటల్ నైపుణ్యాల పరంగా వారికి మరింత ప్రభావవంతంగా ఎలా శిక్షణ ఇవ్వగమనే విషయంపై ఆలోచనలు చేస్తున్నాం” అని సీఈఓ చెప్పుకొచ్చారు. ఈ ఐటీ సంస్థ ఇప్పటికే అనేక హైరింగ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసింది. ఇందులో ఎక్కువగా బీఎస్సీ, బీసీఏ గ్రాడ్యుయేట్‌లను కంపెనీ నియమించుకుంది. కోవిడ్ విజృంభించిన తరువాత ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ 2021-22లో 23.8% అట్రిషన్‌ను నమోదు చేసింది. ఇది ఆల్-టైమ్ హై అట్రిషన్‌గా కంపెనీ పేర్కొంది. దీనితో ఈ కంపెనీలో ఖాళీలు పెరిగి ఉద్యోగ నియామకాలు కూడా పెరుగుతున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Freshers, IT Employees, IT jobs, Mindtree, Un employement

తదుపరి వార్తలు