హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Sanskrit Course: అమృత విశ్వ విద్యాపీఠంలో సంస్కృతంపై సర్టిఫికేట్ కోర్సు.. ఫీజు రూ.500 కంటే తక్కువే..

Sanskrit Course: అమృత విశ్వ విద్యాపీఠంలో సంస్కృతంపై సర్టిఫికేట్ కోర్సు.. ఫీజు రూ.500 కంటే తక్కువే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sanskrit Course: అమృత విశ్వ విద్యాపీఠం సస్కతసాపరి (Sasktasapary) అనే సాంస్క్రిట్ ఆన్‌లైన్ డిప్లొమా సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఈ సర్టిఫికెట్ కోర్సు ద్వారా సంస్కృత భాషలో తప్పులు లేకుండా అనర్గళంగా మాట్లాడే టెక్నిక్స్‌ నేర్చుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సంస్కృతం(Sanskrit)లో అనర్గళంగా మాట్లాడటం (Speaking), పర్ఫెక్ట్‌గా రాయడం (Writing) మీ కలా.. అయితే తమిళనాడు కోయంబత్తూర్‌లోని అమృత విశ్వ విద్యాపీఠం (Amrita Vishwa Vidyapeetham) నుంచి మీకు ఒక గుడ్‌న్యూస్. రూ.500 కంటే తక్కువ కోర్సు ఫీజుతో “సస్కతసాపరి (Sasktasapary)” అనే సాంస్క్రిట్ ఆన్‌లైన్ డిప్లొమా సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఈ సర్టిఫికెట్ కోర్సు ద్వారా సంస్కృత భాషలో తప్పులు లేకుండా అనర్గళంగా మాట్లాడే టెక్నిక్స్‌ నేర్చుకోవచ్చు. అంతేకాదు సంస్కృతంలో రాయగల మెళకువలను కూడా తెలుసుకోవచ్చు. అమృత స్కూల్ ఆఫ్ స్పిరిచువల్ అండ్ కల్చరల్ స్టడీస్ ఈ కోర్సును ఎలా కొనసాగించాలో ఇన్‌స్ట్రక్ట్ చేస్తోంది. ఈ కోర్సు అమృతపురిలోని క్యాంపస్‌లో జరుగుతుంది.

సస్కతసాపరి సర్టిఫికెట్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు amrita.edu/ahead/samskrtasaparya అధికారిక లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ఫస్ట్ బ్యాచ్ సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. ఆరు వారాల పాటు కొనసాగే ఈ కోర్సులో విద్యావేత్తలు వీడియో లెసన్స్, లైవ్ కోర్సులు, డిబేట్లు, వర్క్‌షీట్‌లు వంటి చాలా యాక్టివిటీస్ నిర్వహిస్తారు.

అంతేకాదు వివిధ రకాల టీచింగ్ మెథడ్స్ ద్వారా లెక్చర్స్ ఇస్తారు. సంస్కృతం అందరికీ అర్థమయ్యేలా చక్కటి పద్ధతిలో బోధిస్తారు. ఇదే కోర్సులో గ్రూప్ డిస్కషన్స్, లైవ్ ఇంటరాక్టివ్ సెషన్లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా విద్యార్థులు విద్యావేత్తలతో కమ్యూనికేట్ చేయవచ్చు. లైవ్ ఇంటరాక్టివ్ సెషన్లు, గ్రూప్ డిస్కషన్‌ల ద్వారా విద్యార్థులు పండితుల (Scholars)తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

పైన చెప్పినవన్నీ కేవలం రూ.475 ఫీజుగా చెల్లించి ఈ కోర్సు ద్వారా పొందవచ్చు. అందరికీ ఓపెన్ అయి ఉండే ఈ కోర్సులో ఎవరైనా సరే పాల్గొనవచ్చు. నేషనల్ ఇన్స్‌ట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ర్యాంకింగ్స్ 2022 ప్రకారం అమృత విశ్వ విద్యాపీఠం ఇండియాలో ఐదవ ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది. ఈ యూనివర్సిటీ NAAC రేటింగ్స్‌లో A++ గ్రేడ్ సైతం పొందింది.

ఇది కూడా చదవండి :నిరుద్యోగులకు అలర్ట్.. ఈవారం అప్లై చేసుకోవాల్సిన జాబ్ లిస్ట్ చెక్ చేయండి..

భారత దేశ ప్రజలలో సంస్కృతభాష నైపుణ్యం పెంచేందుకు ఇతర విద్యా సంస్థలు సైతం తమ వంతు కృషి చేస్తున్నాయి. 2022 ప్రారంభంలో సంస్కృత భారతితో కలిసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీలోని సాంస్క్రిట్ క్లబ్ కొత్త ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సుతో భగవద్గీత ద్వారా సాధారణంగా మాట్లాడగలిగే సంస్కృతాన్ని బోధించింది.

సస్కతసాపరి కోర్సు అనేది సంస్కృత భాషలో ఓనమాలు దిద్దుతున్న వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కోర్సులో వర్ణమాలల నుంచి సంస్కృతం భాషలో దోషాలు లేకుండా సెంటెన్స్ ఫ్రేమింగ్ చేసే వరకు విద్యావేత్తలు మెళకువలు నేర్పిస్తారు. చాలా భాషల లోని పదాలను సంస్కృతం నుంచే తీసుకున్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది పండితుల ప్రకారం, సంస్కృత భాషపై పట్టు సాధిస్తే ప్రపంచంలోని ఏ భాషనైనా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడం చాలా సులభం అవుతుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS

ఉత్తమ కథలు