మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో సైతం మార్పులొస్తున్నాయి. నూతన టెక్నాలజీపై పట్టు సాధించిన వారికే ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. అందుకే ప్రతిష్టాత్మక సంస్థలు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తున్నాయి. తద్వారా ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలపై ప్రాక్టికల్ శిక్షణనిస్తున్నాయి. తాజాగా అమిటీ యూనివర్సిటీ బీసీఏ, ఎంసీఏ విద్యార్థుల కోసం రిమోట్ ఇంటర్న్‌షిప్‌లను ప్రారంభించింది. టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అయాన్ భాగస్వామ్యంతో ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తుంది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా క్లౌడ్ అండ్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ & వర్చువల్ రియాలిటీ, మెషిన్ లెర్నింగ్ వంటి నూతన కోర్సులపై శిక్షణనిస్తోంది.
విద్యార్థుల్లో జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్‌ను పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఇంటర్న్‌షిప్‌ను డిజైన్ చేసింది. ఈ రిమోట్ ఇంటర్న్‌షిప్ ప్రారంభంపై అమిటీ యూనివర్సిటీ ఆన్‌లైన్ చైర్మన్ అజిత్ కె చౌహాన్ మాట్లాడుతూ “విద్యార్థులను ఇండస్ట్రీ రెడీగా తీర్చిదిద్దేందుకు రిమోట్ ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభించాం. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అమిటీ యూనివర్శిటీకి చెందిన అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో క్లాసులుంటాయి.’’ అని చెప్పారు.
NEET 2022 Study Plan: నీట్-2022 బయాలజీ స్టడీ ప్లాన్: ఇలా చదివితే 360 మార్కులు ఎక్కడికీ పోవు..
ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఐటీ పరిశ్రమలోని ప్రొఫెషనల్స్ తమ సలహాలు, సూచనలు విద్యార్థులకు అందజేస్తారు. టీసీఎస్ అయాన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. నాలుగు, ఆరు సెమిస్టర్‌లలో ఉన్న బీసీఏ విద్యార్థులకు, మూడో సెమిస్టర్లో ఉన్న ఎంసీఏ విద్యార్థులకు ఈ రిమోట్ ఇంటర్న్‌షిప్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆయా విద్యార్థులకు ఫైనలియర్లో నిర్వహించే ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
టీసీఎస్ అయాన్ భాగస్వామ్యంతో..
అమిటీ యూనివర్సిటీ రిమోట్ ఇంటర్న్‌షిప్‌ను 500లకు పైగా కార్పొరేట్ కంపెనీలు పరిగణలోకి తీసుకుంటున్నాయని, ఇంటర్న్‌షిప్ చేసిన విద్యార్థులకు ఆయా సంస్థలు ప్లేస్‌మెంట్ అవకాశాలను కూడా అందిస్తున్నాయని అజిత్ కె చౌహాన్ తెలిపారు. ఇక, కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు టీసీఎస్ అయాన్ నుంచి సర్టిఫికేట్ అందజేస్తారు. అంతేకాదు, వారి డిగ్రీ ప్రోగ్రామ్‌లో అకడమిక్ క్రెడిట్‌లను కూడా పొందుతారు.
WhatsApp: వాట్సప్ వాడుతున్నారా.. అయితే ఈ ఫీచర్స్.. జాగ్రత్తలు తెలుసుకోండి!
అమిటీ యూనివర్సిటీతో భాగస్వామ్యం గురించి టీసీఎస్ అయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి మాట్లాడుతూ, “డిజిటైజేషన్ క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి నూతన టెక్నాలజీల్లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. ఈ నిపుణులను నియమించుకోవడానికి భారతీయ జాబ్ మార్కెట్ అతిపెద్దది. ప్రస్తుత అంచనాల ప్రకారం, ఆగస్టు 2020 చివరి నాటికి డేటా సైన్స్‌లో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతాం. ఇందుకు, అమిటీ యూనివర్సిటీ తో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉంది.’’ అని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exams