MGNREGA: కరోనా కష్ట కాలం... 2020లో ఉపాధి హామీ పథకంతో 9 కోట్ల మందికి రిలీఫ్

కరోనా కష్ట కాలం... 2020లో ఉపాధి హామీ పథకంతో 9 కోట్ల మందికి రిలీఫ్ (File Image)

MGNREGA: కరోనా వైరస్... కోట్ల మంది ఉపాధి అవకాశాల్ని ఎగరేసుకుపోయింది. ఫలితంగా రోడ్డున పడిన వారంతా... మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేరిపోయారు.

  • Share this:
    MGNREGA in 2020: ఈ సంవత్సరం ఇప్పటివరకూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)లో 9 కోట్ల మందికి పైగా చేరారంటే నమ్మగలరా? ఇంకా ఆశ్చర్యమేంటంటే... ఈ చట్టం వచ్చాక ఏ సంవత్సరంలోనూ ఇంత మంది చేరలేదు. దీనంతటికీ కారణం కరోనా వైరస్సే. ఈ వైరస్ ఇండియాలో ప్రవేశించగానే... లాక్‌డౌన్ ప్రకటనలతో... పరిశ్రమలు, షాపులు, థియేటర్లు, పార్కులు, స్కూళ్లు, ప్రైవేట్ ఆఫీసులు ఇలా అన్నీ మూతపడ్డాయి. దాంతో కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. పొట్టకూటి కోసం ఏదో ఒక పనిచెయ్యాలని చాలా మంది ఉపాధి హామీ పథకంలో చేరిపోయారు. అలా ఈ సంవత్సరం 9 కోట్ల మందికి పైగా చేరడం ఓ రికార్డు అనుకోవచ్చు. 2005లో ఈ పథకం అమల్లోకి వచ్చింది. గ్రామాల్లో ప్రజలకు ఉపాధి కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ పథకంలో ఇంత ఎక్కువ మంది చేరడం ఇదే తొలిసారి. కేంద్ర ప్రభుత్వానికి RTI చట్టం ద్వారా పెట్టుకున్న అభ్యర్థనతో ఈ విషయం తెలిసింది.

    ప్రతిష్టాత్మక పథకం:
    మహాత్మాగాంధీ నరేగా చట్టాన్ని కాంగ్రెస్ సారధ్యంలోని UPA ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. పేదవాళ్లకు ఇది సజీవ కట్టడం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని మెచ్చుకున్నారు. నిజంగానే కరోనా సమయంలో... ఈ పథకమే దేశ గ్రామీణ ప్రజలను కాపాడినట్లు తాజా లెక్కలను బట్టీ అర్థమవుతోంది. కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నిరుద్యోగం బాగా పెరిగింది. ఇంజినీరింగ్ చదివిన అభ్యర్థులు సైతం... ఉపాధి హామీ పథకంలో చేరి పనులు చేసిన సందర్భాలు కనిపించాయి.

    RTI ద్వారా వచ్చిన రిప్లై ఆధారంగా... ఈ సంవత్సరం 9 కోట్ల మందికి పైగా నరేగాలో చేరగా... 2019లో 8 కోట్ల మంది దాకా ఇందులో చేరినట్లు తెలిసింది. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి తేజ్‌పాల్ ఈ అభ్యర్థన పెట్టారు. 2013 నుంచి ఈ స్కీమ్‌లో ఎంత మంది చేరారో చెప్పాలని కోరారు. అందుకు సంబంధించి ఓ టేబుల్ ద్వారా సమాచారం లభించింది.

    కరోనా కష్ట కాలం... 2020లో ఉపాధి హామీ పథకంతో 9 కోట్ల మందికి రిలీఫ్


    వీపీ కల:
    నిజానికి ఈ ఉపాధి హామీ పథకం అనేది యూపీఏ ప్రభుత్వ ఆలోచన కాదు. 1991లో ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గట్టెక్కించిన మాజీ ప్రధానమంత్రి వీపీ నరసింహారావు ప్రభుత్వం ఈ పథకాన్ని తొలిసారి ప్రతిపాదించింది. అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్... ప్రధానిగా మారాక... 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలో చట్టంగా చేశారు. ఇది ఎంత గొప్ప చట్టం అంటే... ప్రపంచంలోనే ఇది అతి పెద్ద ఉపాధి హామీ పథకంగా గుర్తింపు పొందింది. అతిపెద్ద, ప్రతిష్టాత్మకమైన సామాజిక భద్రత, ప్రజా పనుల కార్యక్రమంగా దీనికి గుర్తింపు వచ్చింది. గ్రామీణ అభివృద్ధికి ఈ పథకం వెన్నుదన్నుగా నిలుస్తుందనే ప్రశంసలు దక్కాయి.

    ప్రతి ఆర్థిక సంవత్సరంలో... కనీసం 100 రోజులపాటూ... పేదవారికి, గ్రామాల్లో వారికి ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లోని ప్రతి ఇంట్లోని పెద్దవారు ఈ పథకంలో చేరి... అంతగా నైపుణ్యం అవసరం లేని పనిని చేపట్టి... ఉపాధి పొందవచ్చు.

    ఇది కూడా చదవండి:Disha Case: దిశ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో ఎన్‌కౌంటర్ జరిగి ఏడాది పూర్తి...

    ఇండియాలో ఇప్పటికీ అత్యధిక మంది వ్యవసాయరంగంలోనే ఉపాధి పొందుతున్నారు. అందువల్ల ఆ రంగంలో అభివృద్ధి దేశానికి అత్యంత కీలకం. అందువల్ల మహాత్మాగాంధీ నరేగా పథకం ద్వారా... వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. తద్వారా దేశం కూడా అభివృద్ధివైపు అడుగులు వేయగలుగుతోంది.
    Published by:Krishna Kumar N
    First published: