హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

American Degrees: అమెరికాలో ఎలాంటి డిగ్రీ చదవడం బెస్ట్..? బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను ఎలా ఎంచుకోవాలి..?

American Degrees: అమెరికాలో ఎలాంటి డిగ్రీ చదవడం బెస్ట్..? బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను ఎలా ఎంచుకోవాలి..?

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలను‌కుంటున్న యువతకు అమెరికా వెల్‌‌కమ్ చెబుతోంది. సరైన అమెరికన్ డిగ్రీ పొందడానికి అక్కడ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ కోర్సు ఎంచుకోవాలో తెలియక చాలా మంది విద్యార్థులు తికమక పడుతుంటారు. 

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలను‌కుంటున్న యువతకు అమెరికా(America) వెల్‌‌కమ్ చెబుతోంది. సరైన అమెరికన్ డిగ్రీ(American Degree) పొందడానికి అక్కడ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ కోర్సు ఎంచుకోవాలో తెలియక చాలా మంది విద్యార్థులు(Students) తికమక పడుతుంటారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(Bachler of Arts) లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(Bachler of Science), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(Master Of Business Admiration) లేదా డాక్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్.. ఇలాంటి వాటిలో దేన్ని ఎంచుకోవాలి అనేది చాలా కష్టంగా అనిపించవచ్చు. అయితే సరైన కోర్సులను ఎంచుకోవడంలో విద్యార్థులకు సహాయపడే వనరులను పరిశీలిద్దాం.

అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు

చాలా మంది విద్యార్థులు తమ కెరీర్‌గా ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెలియక డైలమాలో ఉంటారు. అయితే అది పెద్ద సమస్య కాదని అంటున్నారు బర్నార్డ్ కాలేజ్ రిక్రూట్‌మెంట్ అండ్ సెలక్షన్ డైరెక్టర్ రూబీ భట్టాచార్య. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులు, యూనివర్సిటీలకు దరఖాస్తు చేసే సమయంలో నిర్దిష్ట ప్రోగ్రామ్‌ను పేర్కొనాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. విద్యార్థులు యూనివర్సిటీలో చేరిన తరువాత మొదటి సంవత్సరం లేదా రెండో ఏడాది‌లోపు ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఖరారు చేసుకోవచ్చని వెల్లడించారు.

Btech-Mtech Students: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేషనల్ హైవే అందిస్తున్న ఆఫర్ ఇదే..


కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, బిజినెస్, ఎకనామిక్స్, సైకాలజీ వంటి మేజర్‌ కోర్సులు భారతదేశంలోని విద్యార్థులలో బాగా ప్రాచుర్యం పొందాయని శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అడ్మిషన్ డైరెక్టర్ ప్రణవ్ ప్రధాన్ చెప్పారు. దీంతో మేజర్‌ కోర్సును ఎంపిక చేసుకునేటప్పుడు ఓపెన్ మైండ్‌‌గా ఉండాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు. నైపుణ్యం, విద్యాపరమైన ఆసక్తి, కెరీర్ లక్ష్యాలు వంటి ప్రాథమిక అంశాలను దృష్టిలో పెట్టుకుని కోర్సును ఎంచుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం ఎంచుకున్న కోర్సు నచ్చకపోతే మొదటి దశలో కోర్సు మారడానికి లేదా మరో యూనివర్సిటీలో చేరడానికి అవకాశం ఉంటుంది.

గ్రాడ్యుయేట్ డిగ్రీలు

బ్యాచిలర్ డిగ్రీ తర్వాత సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (STEM) రంగాలలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌ చేయడం చాలా మంది కల. ఇందులో "కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ వంటి ప్రోగ్రామ్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. NYయూనివర్సిటీకి చెందిన టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో అడ్మిషన్స్ అంబాసిడర్ అభ్యుదయ్ పాయ్ మాట్లాడుతూ.. స్పెషలైజ్డ్ మాస్టర్స్ డిగ్రీలు అభివృద్ధి చెందుతున్న కెరీర్‌లను నిర్మించడంలో కీలకమైన దశ అని అన్నారు. విద్యార్థులు నాలెడ్జ్ బేస్‌ను మరింత విస్తరించుకోవడానికి ఇది గొప్ప మార్గమే కాకుండా, ఆసక్తి ఉన్న ఇతర రంగాలను నెట్‌వర్క్ చేయడానికి, అన్వేషించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమన్నారు.

మాస్టర్స్ డిగ్రీ

మాస్టర్స్ డిగ్రీకి.. నాన్-STEM రంగాలు మంచి ప్రేరణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటేషనల్ బయాలజీ, రోబోటిక్స్, మెకాట్రానిక్స్ వంటి డిమాండ్ ఉన్న రంగాల్లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి చాలా విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల కాలంలో ఆర్కిటెక్చర్, డిజైన్ రంగాల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు చేయడానికి అధిక ఆసక్తి చూపుతున్నారని అరిజోనా స్టేట్ యూనివర్శిటీ రిక్రూట్‌మెంట్ అడ్వైజర్-ఇండియా నిక్కీ చోక్షి తెలిపారు. అరిజోనా స్టేట్ ఒక్కటే 450 మాస్టర్స్, ఇతర గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అవకాశాలను అందిస్తోందని ఆమె వివరించారు.

Dental Insurance: PNB మెట్‌లైఫ్ నుంచి కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్.. మొదటిసారి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్..


‘డిగ్రీ సర్టిఫికేట్ సంపాదించడానికి ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీంతో ఏది ఎంచుకోవాలో తెలియక గందరగోళంగా అనిపించవచ్చు. ఈ సమయంలో విద్యార్థులు తమను ఆకర్షించే ప్రోగ్రామ్‌పై దృష్టి పెట్టాలి. మీ కెరీర్ మొత్తంలో మీరు నేర్చుకునే ఒక విషయాన్ని కనుగొనడంలో మీ సమయాన్ని, కృషిని పెట్టుబడిగా పెట్టండి.’ అని అభ్యుదయ్ పాయ్ సూచించారు. అది మీ అభిరుచికి తగ్గట్టుగా ఉండాలన్నారు. డిగ్రీ ప్రోగ్రామ్‌కి దరఖాస్తు చేసుకునే సమయంలో సలహాలు సూచనల కోసం నేరుగా యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రతినిధులను సంప్రదించాలని చోక్షి సూచించారు.

ఈ స్టోరీ మొదట స్పాన్ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది.

First published:

Tags: Career and Courses, Post graduates, Students, Under graduation

ఉత్తమ కథలు