IT Jobs: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. 7,000 మంది టెక్కీలను నియమించుకోనున్న అమెరికన్ కంపెనీ

యూఎస్‌టీ జాబ్స్‌

IT Jobs: ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది గ్లోబల్ టెక్ కంపెనీ UST. అమెరికా (America) కాలిఫోర్నియాలో ఉన్న సంస్థ దేశీయ మార్కెట్ అవసరాలతో పాటు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ సంస్థ భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టనుంది.

  • Share this:
IT ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది గ్లోబల్ టెక్ కంపెనీ UST. మార్కెట్ అవసరాలతో పాటు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ సంస్థ భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టనుంది. ప్రస్తుతం సంస్థ బెంగళూరు (Bangalore) కార్యాలయంలో 6,000 మంది పనిచేస్తుండగా, 2023 నాటికి ఉద్యోగుల సంఖ్యను 12,000కు పెంచుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ కంపెనీ 2020 ఫిబ్రవరి నుంచి 2000 మంది ఉద్యోగులను చేర్చుకుంది. రానున్న 18-24 నెలల్లో బెంగళూరు కేంద్రంలో పనిచేయడానికి ఎంట్రీ-లెవల్ ఇంజనీరింగ్ (Engineering) గ్రాడ్యుయేట్లతో పాటు అనుభవజ్ఞులైన ఇంజనీర్లను నియమించుకోనునట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. UST హైదరాబాద్ (Hyderabad) ఆఫీస్‌లో ఉద్యోగుల సంఖ్య ఇటీవల 1000కి చేరుకుంది. రానున్న రెండేళ్లలో ఈ సంఖ్యను 2000కు పెంచాలని కంపెనీ భావిస్తోంది.

UST కంపెనీ హెడ్ ఆఫీస్ అమెరికా (America)లోని కాలిఫోర్నియాలో ఉంది. ఈ సంస్థ 25 దేశాల్లో 35 కంటే ఎక్కువ ప్రాంతాల్లో కార్యాలయాలను నిర్వహిస్తోంది.

DCCB Recruitment 2021: విజ‌య‌న‌గ‌రం డీసీసీబీలో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, జీతం వివ‌రాలు


బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, తిరువనంతపురం, కొచ్చి, పూణె, కోయంబత్తూర్, హోసూర్, ఢిల్లీ NCRలలో UST ప్రత్యేక సాఫ్ట్‌వేర్ డెలివరీ కేంద్రాలను కలిగి ఉంది.

తాజా నిర్ణయాలపై UST చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఇండియా హెడ్ అలెగ్జాండర్ వర్గీస్ మాట్లాడుతూ, ‘బెంగళూరులో మా కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. USTలో అత్యుత్తమ ప్రతిభావంతులను నియమించుకోవాలని నిర్ణయించుకున్నాం. మా గ్లోబల్ క్లయింట్‌ల అవసరాలకు అనుగుణంగా పనిచేసే వారిని ఎంపిక చేస్తాం’ అని చెప్పారు. బెంగళూరుతో పాటు భారతదేశం (India)లోని వివిధ టైర్ 1, టైర్ 2 నగరాల్లో సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు.

DCCB Recruitment 2021: గుంటూరు డీసీసీబీలో 67 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం


UST బెంగళూరు సెంటర్ హెడ్, కంపెనీ ఇండియా విభాగం జనరల్ మేనేజర్ మను శివరాజన్. ఈ నియామకాలు తమ సంస్థ వృద్ధికి నిదర్శనమని చెప్పారు.

కర్ణాటక ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ EV రమణా రెడ్డి మాట్లాడుతూ.. ‘బెంగళూరు కార్యాలయంలో UST ఉద్యోగుల సంఖ్య 6,000 దాటినందుకు సంస్థను అభినందిస్తున్నాను. భారత్‌లో UST సేవలను మరికొన్ని నగరాలకు విస్తరిస్తుందని భావిస్తున్నాం. రాబోయే కొన్ని సంవత్సరాలలో బెంగుళూరులో మరింత మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటుందని ప్రకటించడం మంచి విషయం. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.’ అని చెప్పారు.

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, సైబర్‌సెక్యూరిటీ (Cyber Security) , క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జావా, డేటా సైన్స్ & ఇంజనీరింగ్, అప్లికేషన్ డెవలప్‌మెంట్ అండ్ మోడరనైజేషన్, AI/ML, ఆటోమేషన్‌(RPA/IPA) లో డిజిటల్ నైపుణ్యాలు ఉన్న వారిని నియమించుకోనున్నట్లు UST ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం 10,000 మందికి పైగా కొత్త ఉద్యోగులను నియమించుకుంటామని సంస్థ వెల్లడించింది.
Published by:Sharath Chandra
First published: