Home /News /jobs /

AMBEDKAR OPEN UNIVERSITY ADMISSIONS 2022 2023 GET TO KNOW THE DETAILS AND OTHER IMPORTANT DATES HERE VB

BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో 2022 – 23 విద్యా సంవత్సరానికి గాను దూర విద్యా ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్‌, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల అయింది. వివరాలిలా..

దూరవిద్య ద్వారా చదువుకోవాలనుకునే హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Ambedkar Open University) డిగ్రీ, పీజీ, పీజీ డిప్లమా మరియు సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022-2023 సంవత్సరానికి గానూ ప్రవేశాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. అండర్ గ్రాడ్యుయేట్, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను వెల్లడించింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు.. పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

TS EAMCET Preparation Tips: మ్యాథ్స్ పై పట్టు సాధిస్తే.. ఎంసెట్ లో ర్యాంక్ సులువే.. నిపుణుల సలహాలు, సూచనలివే..


దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో స్వీకరిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ నేటి(జూన్ 30) నుంచి ప్రారంభం అవ్వగా.. జూలై 31వ తేదీతో ముగియనుంది. మరిన్ని వివరాలను https://www.braouonline.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. వీటితోపాటుగా అంతకు ముందు విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన వారు.. సెకండియర్‌ ట్యూషన్‌ ఫీజును, అంతకుముందు చేరిన విద్యార్థుల్లో సకాలంలో చెల్లించలేకపోయిన వారు కూడా జూలై 31వ తేదీ లోగా ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ - తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ - ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొంది. ఇవి కూడా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి. మరిన్ని వివరాలకు వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600లకు కాల్​ చేయాలని సూచించారు.

కోర్సులు : డిగ్రీ కోర్సులు B.A., B.Com., B.Sc..

పీజీ కోర్సులు : M.A., M.Com., M.Sc., M.B.A., BLISc., M.LISc., P.G. డిప్లొమా
మరియు వివిధ సర్టిఫికెట్ కోర్సులు

దరఖాస్తు పద్ధతి : ఆన్లైన్

దరఖాస్తు రుసుము చెల్లింపు పద్దతి : క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ద్వారా చెల్లించవచ్చు.

దరఖాస్తు ప్రారంభ తేదీ : జూన్ 30,2022

దరఖాస్తు చివరి తేదీ : జూలై 31, 2022

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
Published by:Veera Babu
First published:

Tags: Admissions, Career and Courses, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు