ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ పలు పోస్టుల భర్తీ ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో సెల్లర్ సపోర్టు అసోసియేట్ (Seller Support Associate) పోస్టులు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ పోస్టులకు ఎంపికైన వారిని వర్క్ ఫ్రం హోం (Work From Home) ఇవ్వనున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.
అమెజాన్ (Amazon)నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. పలు వర్క్ ఫ్రం హోం (Work From Home) ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. సెల్లర్ సపోర్టు అసోసియేట్ (Seller Support Associate) పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి ఏదైన డిగ్రీ చేసి ఉంటే చాలు. పూర్తి వివరాలకు అధికారి వెబ్ సైట్ https://www.amazon.jobs/en సందర్శించవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం పూర్తిగా ఆన్లైన్ (Online) ద్వారా నిర్వహిస్తారు. ఎంపిక అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగికి వర్క్ ఫ్రం హోం అవకాశం ఇస్తోంది అమెజాన్ (Amazon). ప్రస్తుతం భర్తీ చేయనున్న సెల్లర్ సపోర్టు అసోసియేట్ ఉద్యోగాల దరఖాస్తు చేసుకోవాలను కొంటున్న అభ్యర్థులు ఈ వివరాలు తెలుసుకోండి.
ముఖ్య సమాచారం..
పోస్టు పేరు
సెల్లర్ సపోర్టు అసోసియేట్ (Seller Support Associate)
జీతం
సీటీసీ - సంవత్సరానికి రూ. 2,75,000 నుంచి రూ.4,00,000
- ఇంగ్లీష్ లో మంచి భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ (Communication Skills) ఉండాలి.
- 24/7 షిఫ్ట్ లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
- వర్క్ ఫ్రం హోంకు అవసరమైన ఇంటర్నెట్ ఫెసిలిటీ బాధ్యత ఉద్యోగిదే.
- వారానికి 5 పని దినాలు, రెండు రోజులు సెలవులు (Holydays) ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్థవంతంగా వినియోగించుకొనే సామర్థ్యం ఉండాలి.
- ఉద్యోగి హైదరాబాద్ లో సంస్థకు అందుబాటులో ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.