Amazon Jobs: పండుగ సీజన్‌లో 1,10,000 ఉద్యోగాలు కల్పిస్తున్న అమెజాన్

Amazon Jobs: పండుగ సీజన్‌లో 1,10,000 ఉద్యోగాలు కల్పిస్తున్న అమెజాన్ (ప్రతీకాత్మక చిత్రం)

Amazon Jobs | దసరా, దీపావళి సీజన్‌లో నిర్వహించబోయే సేల్స్‌ని (Festival Sale) దృష్టిలో పెట్టుకొని ఇండియాలో 1,10,000 ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది.

  • Share this:
    అమెజాన్‌లో ఉద్యోగాలు (Amazon Jobs) కోరుకునేవారికి అలర్ట్. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని అమెజాన్ భారతదేశంలో 1,10,000 సీజనల్ ఉద్యోగాలు కల్పిస్తోంది. ఇవి పార్ట్ టైమ్ జాబ్స్ (Part Time Jobs) మాత్రమే. ఈ ఫెస్టివల్ సీజన్‌లో నిర్వహించే సేల్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ ఉద్యోగాలు కల్పిస్తోంది అమెజాన్. దేశవ్యాప్తంగా ఆపరేషన్స్ నెట్వర్క్‌లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణె, చెన్నై, లక్నో, కోల్‌కతా లాంటి ప్రాంతాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తోంది. అమెజాన్ నెట్వర్క్‌లో అసోసియేట్స్‌గా అవకాశం కల్పిస్తోంది. ఆర్డర్స్ పిక్ చేయడం, ప్యాక్ చేయడం, షిప్పింగ్ చేయడం, కస్టమర్లకు డెలివరీ చేయడం లాంటి సేవల్ని అందించాల్సి ఉంటుంది.

    అమెజాన్‌లో అక్టోబర్ 4న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా అమెజాన్ నిర్వహించే అతిపెద్ద సేల్ ఇది. ఈ సేల్ ముగిసిన తర్వాత దివాళీ సేల్ కూడా ఉంటుంది. ఈ సేల్‌లో లక్షలాది మంది చిరు వ్యాపారులు పాల్గొంటారని అంచనా. ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పార్శిల్ డెలివరీల సంఖ్య పెరుగుతుంది. అమెజాన్‌లో డెలివరీ పార్ట్‌నర్ ఉద్యోగాలు కోరుకునేవారు Amazon Flex ప్లాట్‌ఫామ్ ద్వారా రిజిస్టర్ చేయొచ్చు.

    ONGC Recruitment 2021: ఓఎన్‌జీసీలో 313 ఉద్యోగాలు... రూ.1,80,000 వరకు వేతనం

    అమెజాన్ ఫ్లెక్స్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులు, పార్ట్ టైమ్ జాబ్స్ కోరుకునేవారు, నిరుద్యోగులు ఎవరైనా చేరొచ్చు. Amazon Flex యాప్ డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ చేయాలి. ఏ సమయంలో పనిచేయాలనుకుంటున్నారో వెల్లడించాలి. అమెజాన్‌ డెలివరీ పార్ట్‌నర్‌గా మారి పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చు. అమెజాన్ డెలివరీ పార్ట్‌నర్ రోజుకు 40 నుంచి 100 వరకు ఆర్డర్స్ డెలివరీ చేయొచ్చు.

    అమెజాన్ ఫ్లెక్స్ ద్వారా గంటకు రూ.120 నుంచి రూ.140 వరకు సంపాదించొచ్చు. ప్రాంతాన్ని బట్టి ఇది మారొచ్చు. అమెజాన్ డెలివరీ పార్ట్‌నర్‌గా మారాలంటే సొంత వాహనం ఉండాలి. అమెజాన్ ఫ్లెక్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://flex.amazon.in/ వెబ్‌సైట్ లేదా Amazon Flex యాప్‌లో తెలుసుకోవచ్చు.

    IOCL Recruitment 2021: డిప్లొమా, డిగ్రీ పాస్ అయినవారికి ఐఓసీఎల్‌లో 535 ఉద్యోగాలు... రూ.1,05,000 వేతనం

    ఇక అసోసియేట్స్‌ ఉద్యోగాలతో పాటు కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్‌ని కూడా నియమించుకుంటోంది అమెజాన్. వర్చువల్ కస్టమర్ సర్వీస్ మోడల్ ద్వారా సేవలు అందించొచ్చు. ఇంటి నుంచే పనిచేయొచ్చు. ఉద్యోగులు తమకు అనుకూలంగా ఉన్న సమయంలో సేవల్ని అందించొచ్చు.

    అమెజాన్ ఇండియా ఈ నెలలో కెరీర్ డే ద్వారా 8,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా అదనంగా 1,10,000 తాత్కాలిక ఉద్యోగావకాశాలు అందిస్తోంది. అంతేకాదు... 2025 నాటికి భారతదేశంలో 10 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని అమెజాన్ వెల్లడించింది.
    Published by:Santhosh Kumar S
    First published: