హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Amazon: అమెజాన్ నుంచి ఉచిత మెషిన్​ లెర్నింగ్​ కోర్సు

Amazon: అమెజాన్ నుంచి ఉచిత మెషిన్​ లెర్నింగ్​ కోర్సు

Amazon: అమెజాన్ నుంచి ఉచిత మెషిన్​ లెర్నింగ్​ కోర్సు
(ప్రతీకాత్మక చిత్రం)

Amazon: అమెజాన్ నుంచి ఉచిత మెషిన్​ లెర్నింగ్​ కోర్సు (ప్రతీకాత్మక చిత్రం)

Amazon Free Machine Learning Course | అమెజాన్ ఇండియా ఉచితంగా మెషీన్ లెర్నింగ్ కోర్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ప్రస్తుతం ప్రపంచ మార్కెట్​లో మెషిన్​ లెర్నింగ్​ (ఎంఎల్​)కు ఎంతో డిమాండ్ ఉంది. అన్ని రంగాల్లో ఈ టెక్నాలజీ వాడకం పెరిగిపోతోంది. అందుకే మెషిన్​ ​ లెర్నింగ్​ నేర్చుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు సులభంగా దొరుకుతున్నాయి. అందుకే ఈ రంగంలో కోర్సులకు ఆదరణ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా మెషిన్​ ​ లెర్నింగ్​లో ఓ కొత్త ప్రోగ్రాంను ప్రారంభించింది. విద్యార్థుల కోసం మెషిన్ లెర్నింగ్​ సమ్మర్ స్కూల్ పేరుతో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్​ను తీసుకొచ్చింది. వివిధ రంగాల్లో పెరుగుతున్న మెషిన్​ లెర్నింగ్ గురించి విద్యార్థులకు బోధించేందుకు, వారి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఈ ప్రోగ్రాంను ప్రారంభించినట్టు అమెజాన్ ప్రకటించింది.

మెషిన్​ ​ లెర్నింగ్​లో ఫండమెంటల్​ కాన్సెప్ట్​లు, వివిధ రంగాల్లో ఎలా వినియోగిస్తున్నారనే అంశాన్ని విద్యార్థులకు అమెజాన్ బోధించనుంది. ఓ ఆన్​లైన్ అసెస్​మెంట్​ ద్వారా ఎంఎల్​ సమ్మర్​ స్కూల్​కు విద్యార్థులను అమెజాన్ ఎంపిక చేయనుంది. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం, మాస్టర్స్​, పీహెచ్​డీ చదువుతున్న విద్యార్థులు ఈ కోర్సు చేసేందుకు అర్హలు. ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్​పూర్​, ఐఐటీ ఢిల్లీ, ఐఐఐటీ హైదరాబాద్​, బిర్లా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్​ (బిట్స్​), నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తిరుచిరాపల్లి, అన్నా యూనివర్సిటీ సహా ఎంపిక చేసిన క్యాంపస్​ల విద్యార్థులు ఈ ఎంఎల్​ సమ్మర్ స్కూల్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

IT Jobs: ఈ 10 స్కిల్స్ ఉన్నవారికి గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థల్లో ఉద్యోగావకాశాలు

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్... డీఏ చెల్లింపులపై డిసైడ్ చేసేది ఆరోజే


ఈ కామర్స్​ డొమైన్‌లలో సమస్యలను మెషిన్​ లెర్నింగ్ ఉపయోగించి ఎలా పరిష్కరించవచ్చనే విషయాన్ని విద్యార్థులకు అమెజాన్ ముందుగా నేర్పనుంది. అలాగే డిమాండ్ ఫోర్​కాస్టింగ్​, కేటలాగ్​ క్వాలిటీ, ప్రొడక్ట్ రెకమెండేషన్​, సెర్చ్ ర్యాంకింగ్​, ఆన్​లైన్​ అడ్వర్​టైజింగ్ సహా వివిధ అంశాల్లో మెషిన్​ లెర్నింగ్ వినియోగంపై ఈ కోర్సు బోధించనుంది. భారత్​లోని టెక్ క్యాంపస్​ల నుంచి విద్యార్థులను ఎంపిక చేసి వర్చువల్ క్లాస్​రూమ్ ట్యుటోరియల్స్ ద్వారా ఈ మెషిన్​ లెర్నింగ్ కోర్సును బోధిస్తామని, ఆ తర్వాత ఇంటెరాక్టివ్​ సెషన్లు కూడా ఉంటాయని అమెజాన్ ఇండియా వెల్లడించింది.

Railway Jobs 2021: రైల్వేలో 3378 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లోని ఆ రెండు జిల్లా అభ్యర్థులకు అవకాశం

IBPS RRB Jobs 2021: తెలుగు రాష్ట్రాల్లో భారీగా బ్యాంకు ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే


కొన్ని యూనివర్సిటీలతో చేతులు కలిపి ఆసక్తి ఉన్న విద్యార్థులకు మెషిన్​ లెర్నింగ్​లో అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యామని అమెజాన్ ఇండియా మెషిన్​ లెర్నింగ్​ వైస్ ప్రెసిడెంట్​ రాజీవ్ రస్టోగి చెప్పారు. ఎంఎల్​ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయని, అందుకే విద్యార్థులను ఆ దిశగా నడిపించడమే తమ లక్ష్యమని తెలిపారు. మెషిన్​ లెర్నింగ్​ను ఉపయోగించి తమ సేవలను మరింత మెరుగు పరుచుకోవాలని అమెజాన్ ఇండియా భావిస్తోంది. ఎంఎల్​ ద్వారా వచ్చే ఆవిష్కరణలు భారత్​తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులపై మంచి ప్రభావం చూపుతాయని ఆశిస్తోంది.

First published:

Tags: AMAZON INDIA, CAREER

ఉత్తమ కథలు